బిజినెస్

స్వల్ప నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 2: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. అంతకుముందు వరుసగా రెండు రోజులూ సూచీలు పతనమైనది తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం రాజ్యసభకు వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) రానుండటం, ఐరోపా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడం మదుపరులను లాభాల స్వీకరణ దిశగా నడిపించాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 21.41 పాయింట్లు పడిపోయి 27,981.71 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 13.65 పాయింట్లు కోల్పోయి 8,622.90 వద్ద నిలిచింది. మెటల్, రియల్టీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పవర్, హెల్త్‌కేర్ రంగాల షేర్ల విలువ 1.78 శాతం నుంచి 0.80 శాతం మేర దిగజారింది. ఆసియా మార్కెట్లలో జపాన్, సింగపూర్ నష్టపోతే, హాంకాంగ్ సూచీ మూతబడింది. ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు 1.42 శాతం వరకు క్షీణించాయి.