బిజినెస్

పిఎమ్‌జెడివై పరిధిలోకి పెన్షనర్ల బ్యాంక్ ఖాతాలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 2: దాదాపు 58 లక్షల పెన్షనర్ల బ్యాంకు ఖాతాలు.. ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన (పిఎమ్‌జెడివై) క్రిందకు రానున్నాయి. 2017 మార్చి 31 నాటికి అన్ని రాయితీలు, సంక్షేమ పథకాలు డైరెక్ట్ బెన్ఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) పరిధిలోకి రావాలన్న ప్రభుత్వ ప్రణాళికలో భాగంగానే పెన్షనర్ల బ్యాంకు ఖాతాలూ పిఎమ్‌జెడివై క్రిందకు వచ్చేలా ఉన్నాయి. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని పర్సనల్, పబ్లిక్ గ్రీవానె్సస్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వ శాఖ ఆదేశించినట్లు కేంద్ర కేబినెట్ కార్యదర్శి తెలిపారు. ఇప్పటికే అన్ని బ్యాంకులు పెన్షనర్ల ఖాతాలకు ఆధార్‌ను అనుసంధానించేస్తున్నాయి. కాగా, ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా 22.65 పిఎమ్‌జెడివై ఖాతాలు తెరుచుకున్నాయని, వీటిలో సుమారు 40,750 కోట్ల రూపాయల బ్యాలెన్స్ ఉందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాల ద్వారా తెలుస్తోంది.