బిజినెస్

బజాజ్ ఆటో అమ్మకాల్లో స్వల్ప క్షీణత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 2: దేశీయ ఆటోరంగ సంస్థ బజాజ్ ఆటో మోటార్‌సైకిల్ అమ్మకాలు గత నెల జూలైలో నిరుడుతో పోల్చితే స్వల్పంగా 1 శాతం పెరిగి 2,85,527 యూనిట్లుగా నమోదయ్యాయి. క్రిందటిసారి 2,82,433 యూనిట్లుగా ఉన్నాయి. అయితే వాణిజ్య వాహనాల విక్రయాలు 7.3 శాతం తగ్గుముఖం పట్టాయి. ఈసారి 44,306 యూనిట్లుగా, పోయినసారి 47,798 యూనిట్లుగా ఉన్నాయి. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటనలో బజాజ్ ఆటో తెలియజేసింది. కాగా, దేశీయ మార్కెట్‌లో మొత్తం ద్విచక్ర, త్రిచక్ర వాహనాల అమ్మకాల విషయానికొస్తే అంతకుముందుతో పోల్చితే స్వల్పంగా తగ్గాయి. గత నెల 3,29,833 యూనిట్లుగా ఉంటే, నిరుడు 3,30,231 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇక ఎగుమతులు కూడా 19.96 శాతం పడిపోయి ఈ జూలైలో 1,31,811 యూనిట్లుగా, గత జూలైలో 1,64,690 యూనిట్లుగా ఉన్నాయి.