బిజినెస్

‘అసహనం’పై స్నాప్‌డీల్ ఆత్మరక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 25: దేశంలో అసహనం తీవ్రతరంపై బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా విమర్శలకు దారి తీసిన నేపథ్యంలో ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఆన్‌లైన్ మార్కెటీర్ స్నాప్‌డీల్ స్పందించింది. ఆయన వ్యాఖ్యలతో తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని బుధవారం ప్రకటించింది. ఆమీర్ వ్యాఖ్యల ప్రభావంతో నెటిజన్లు ఇప్పటికే స్నాప్‌డీల్ యాప్‌ను తమ సోషల్ నెట్‌వర్క్‌ల నుంచి పెద్ద ఎత్తున తొలగించి నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఖ్య మరింతగా పెరుగుతుండటంతో స్నాప్‌డీల్ స్పందించింది. మరోవైపు ఫ్లిప్‌కార్ట్ కూడా స్నాప్‌డీల్‌కు బాసటగా నిలిచింది. బ్రాండ్ అంబాసిడర్ల వ్యక్తిగత అభిప్రాయాలతో తమకు ఎలాంటి సంబంధం ఉండదని ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆమీర్ ఖాన్.. భారత్‌లో అసహనం పెరిగిపోతోందని, ఒకానొక దశలో తన భార్య కిరణ్ రావు దేశం విడిచి వెళ్ళిపోదామంటూ ఆందోళన వ్యక్తం చేసిందని అన్నారు. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఆమీర్ ఖాన్ అభిమానులతోపాటు సినీ, రాజకీయ ఇతరత్రా రంగాలవారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇకపై ఆమీర్ ఖాన్ సినిమాలు చూడబోమంటూ ఆయన ప్రచారం చేసే ఉత్పత్తులనూ కొనేది లేదంటూ సామాజిక వెబ్‌సైట్లలో స్పందించారు. ఈ క్రమంలోనే స్నాప్‌డీల్ యాప్‌ను తొలగించేశారు. అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించారని, తాను భారత్‌లో పుట్టడం తన అదృష్టమని ఆమీర్ చివరకు వివరణ ఇచ్చుకున్నప్పటికీ నిరసనల వెల్లువ మాత్రం ఆగడం లేదు. దీంతో ఆత్మరక్షణలో పడిన స్నాప్‌డీల్ ఆమీర్ ఖాన్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, భారత సంస్కృతి, సంప్రదాయాలను స్నాప్‌డీల్ గౌరవిస్తుందని, డిజిటల్ ఇండియాలో భాగస్వాములమవుతామని, స్నాప్‌డీల్.. ఇక్కడి యువతకు ఆదర్శంగా ఉంటుందని స్పష్టం చేసింది.