బిజినెస్

మార్కెట్లకు భారీ లాభాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 23: విదేశీ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు అద్భుతంగా ఉన్న అమెరికా గణాంకాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ముగిసాయి. బిఎస్‌ఇ సెనె్సక్స్ 260 పాయింట్లు వృద్ది చెందగా జాతీయ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 80 పాయింట్లు లాభపడింది. డిసెంబర్ 3 తర్వాత అంటే దాదాపు 3 వారాల తర్వాత ప్రధాన సూచీలు ఇంత గరిష్ఠస్థాయిని తాకడం ఇదే మొదటిసారి. సెప్టెంబర్ త్రైమాసికంలో కరెంట్ ఖాతా లోటు 1.6 శాతానికి తగ్గడం కూడా మదుపరుల సెంటిమెంట్‌ను మరింత బలోపేతం చేసింది. భారీ కొనుగోళ్ల కారణంగా మెటల్, చమురు, గ్యాస్, హెల్త్‌కేర్, విద్యుత్, రియల్టీ రంగాల షేర్లు మంచి లాభాలు ఆర్జించాయి. దీంతో సెనె్సక్స్ 259.65 పాయింట్లు పెరిగి 25,850.30 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 79.85 పాయింట్లు వృద్ధి చెంది 7865.95 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ నెలలో ఇప్పటివరకు ప్రధానంగా అమ్మకందారులుగా ఉండిన విదేశీ ఫండ్స్ తిరిగి కొనుగోళ్లు దిగినట్లు గణాంకాలు పేర్కొనడం మార్కెట్ సెంటిమెంట్‌కు ఊతమిచ్చింది. అలాగే వరసగా ఏడో రోజు కూడా డాలరుతో రూపాయి బలోపేతం కూడా దీనికి తోడ్పడింది. నిన్నటి ముగింపుకన్నా పై స్థాయిలో బలంగా ప్రారంభమైన దేశీయ మార్కెట్లు దాదాపు రోజంతా అదే రీతిలో కొనసాగాయి. మంగళవారం అమెరికా, ఐరోపా మార్కెట్లు లాభాలతో ముగియడంతో పాటుగా ఆసియా మార్కెట్లు కూడా లాభాల్లో సాగడంతో దేశీయ మార్కెట్లలో కూడా అదే ధోరణి కనిపించింది. సెనె్సక్స్‌లోని 30 కంపెనీల షేర్లలో 25 లాభపడగా, అయిదు మాత్రం నష్టాల్లో ముగిసాయి. రంగాల వారీగా చూస్తే మెటల్ రంగం సూచీ 1.87 పెరిగింది. చమురు, గ్యాస్, హెల్త్‌కేర్, విద్యుత్ రంగాల సూచీలు కూడా బాగానే పెరిగాయి. అంతర్జాతీయంగా హాంకాంగ్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్ ప్రధాన సూచీలు లాభాలతో ముగియగా, షాంఘై సూచీ మాత్రం స్వల్ప నష్టాలతో ముగిసింది. ఐరోపా మార్కెట్లు కూడా ప్రారంభ లావాదేవీల్లో లాభాల బాటలో సాగాయి. ఇదిలా ఉండగా తొలిసారిగా స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ అయిన డాక్టర్ పాథ్‌లాబ్స్, ఆల్‌కెమ్ లేబరేటరీస్ మదుపరులకు భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. కాగా, తమ జాయింట్‌వెంచర్ సంస్థ దేవాస్ భోపాల్ కారిడార్‌లో 37 శాతం వాటాను వెల్‌స్పన్ ఎంటర్‌ప్రైజెస్ 662 కోట్లకు విక్రయించడంతో ఆ కంపెనీ షేరు బుధవారం 12 శాతం పెరిగింది.