బిజినెస్

చివరి సమీక్షకు సమాయత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 5: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని శుక్రవారం ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ కలుసుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో మూడో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష ఈ నెల 9న జరగనున్న క్రమంలో జైట్లీని రాజన్ కలుసుకున్నారు. అయితే ప్రతీ సమీక్షకు ముందు ఆర్థిక మంత్రిని ఆర్‌బిఐ గవర్నర్ కలుసుకోవడం ఆనవాయితీనే అయినప్పటికీ ఈసారి భేటీకి మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. అదే రాజన్ చివరి సమీక్ష కావడం.
ఈ ఏడాది సెప్టెంబర్ 4తో ఆర్‌బిఐ గవర్నర్‌గా రాజన్ మూడేళ్ల పదవీకాలం ముగియనుంది. ఇప్పటికే తాను రెండోసారి గవర్నర్ పదవిని చేపట్టబోనని రాజన్ ప్రకటించినది తెలిసిందే. కొత్త గవర్నర్‌ను త్వరలోనే ఎంపిక చేస్తామని కూడా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 9న జరిపే ద్రవ్యసమీక్షే ఆర్‌బిఐ గవర్నర్‌గా రాజన్‌కు చివరిది కావడంతో జైట్లీతో రాజన్ తాజా భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదిలావుంటే జైట్లీతో స్థూల ఆర్థిక పరిస్థితులపై రాజన్ చర్చించారు. కాగా, తనను కలిసిన విలేఖరులతో ద్రవ్యసమీక్షకు ముందు తాను ఏమీ మాట్లాడలేనని రాజన్ అన్నారు. ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా ద్రవ్యసమీక్షను రాజన్ నిర్వహిస్తారన్న ముద్ర ఉండగా, నిరుడు జనవరి నుంచి ఇప్పటిదాకా కీలక వడ్డీరేటును 150 బేసిస్ పాయింట్లు ఆయన తగ్గించారు. అయితే ఈసారి కీలక వడ్డీరేట్లు యథాతథంగా ఉండొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నప్పటికీ తన చివరి ద్రవ్యసమీక్షలో రాజన్ నిర్ణయాలు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ నెలకొంది.