బిజినెస్

జెఎల్‌ఆర్ అమ్మకాల్లో 34 శాతం వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 5: దేశీయ ఆటోరంగ సంస్థ టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ జాగ్వార్ లాండ్ రోవర్ (జెఎల్‌ఆర్) రిటైల్ అమ్మకాలు నిరుడుతో పోల్చితే గత నెల జూలైలో 34 శాతం పెరిగి 44,486 యూనిట్లుగా నమోదయ్యాయి. లాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్, జాగ్వార్ ఎక్స్‌ఇ, ఎఫ్-పేస్ మోడళ్ల అమ్మకాలు అధికంగా జరిగాయని శుక్రవారం సంస్థ తెలియజేసింది. బ్రిటన్‌లో 38 శాతం, ఇతర ఐరోపా దేశాల్లో 24 శాతం, ఇతర విదేశీ మార్కెట్లలో 2 శాతం మేర అమ్మకాలు పెరిగాయంది. విక్రయాల్లో లాండ్ రోవర్ వాహనాలు 31,288 యూనిట్లుగా, జాగ్వార్ వాహనాలు 13,198 యూనిట్లుగా ఉన్నాయి.

ఆంధ్రా, తెలంగాణల్లో ఇంక్యుబేషన్ సెంటర్లు
నీతి ఆయోగ్‌కు ఎఫ్‌ట్యాప్సీ ప్రతిపాదన

హైదరాబాద్, ఆగస్టు 5: ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌ట్యాప్సీ).. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు ఇంక్యుబేషన్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదించింది. దీనికి సంబంధించి నీతి ఆయోగ్‌కు ప్రతిపాదనలను సమర్పించింది. తెలంగాణలో తయారీ, ఇంజినీరింగ్ కోసం ఇంక్యుబేషన్ సెంటర్‌ను ప్రారంభించాలని, ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ, దాని అనుబంధ రంగాలపై దృష్టి పెట్టడానికి ఇంక్యుబేషన్ సెంటర్‌ను నెలకొల్పాలని ఆ ప్రతిపాదనల్లో నీతి ఆయోగ్‌ను ఎఫ్‌ట్యాప్సీ కోరింది. ‘తెలుగు రాష్ట్రాల్లో రెండు ఇంక్యుబేషన్ సెంటర్లను ఆరంభించాలని మేము నీతీ ఆయోగ్‌కు దరఖాస్తు చేశాము. ఒకటి తెలంగాణలో, మరొకటి ఆంధ్రప్రదేశ్‌లో. నీతి ఆయోగ్ నుంచి ఒకసారి ఆమోదం వస్తే ఇక మేము ఇంక్యుబేషన్ సెంటర్లను ప్రారంభిస్తాం. రాబోయే మూడు, నాలుగు నెలల్లో మా అభ్యర్థనకు నీతి ఆయోగ్ ఆమోదం తెలుపుతుందని భావిస్తున్నాం.’ అని ఎఫ్‌ట్యాప్సీ అధ్యక్షుడు రవీంద్ర మోదీ శుక్రవారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. కాగా, తెలంగాణలో ఇంక్యుబేషన్ సెంటర్‌ను హైదరాబాద్‌లో, ఆంధ్రప్రదేశ్‌లోనైతే విజయవాడ లేదా విశాఖపట్నంలో ఏర్పటవుతుందన్నారు. తెలంగాణలో తయారీ, ఇంజినీరింగ్ విభాగాలపై ఇంక్యుబేషన్ సెంటర్ దృష్టి పెడుతుందని, ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలైన ఆహార తయారీ, మత్స్య పరిశ్రమపై దృష్టి పెడుతుందని ఈ సందర్భంగా రవీంద్ర మోదీ వివరించారు. కాగా, ఐదేళ్లకుపైగా కాలానికిగాను ఒక్కో ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటుకు 10 కోట్ల రూపాయల చొప్పున నీతి ఆయోగ్ గ్రాంట్ వస్తుందని చెప్పారు. ఈ క్రమంలో దీనికి అనుగుణంగా తాము కూడా గ్రాంట్‌ను విడుదల చేస్తామన్నారు. ఇక రాబోయే ఇంక్యుబేషన్ సెంటర్లలో స్టార్టప్‌లకు పరిమితి అంటూ ఏమీ లేదని, ఎన్నైనా ఉండొచ్చన్నారు. ఈ ఏడాది ఎఫ్‌ట్యాప్సీ శత వార్షికోత్సవాలు జరుగుతున్నాయని డిసెంబర్‌లో జరిగే వేడుకలకు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ హాజరవుతారని రవీంద్ర మోదీ తెలిపారు. పారిశ్రామిక, వ్యాపారాభివృద్ధికి ఎఫ్‌ట్యాప్సీ ఎప్పుడూ ముందుంటుందని, దీనికి సంబంధించి అధ్యయనాలు, సెమినార్‌లను నిర్వహించడమేగాక ప్రభుత్వంతో సత్సంబంధాలను కొనసాగిస్తామని అన్నారు.

శత వసంతాల వేడుకల వివరాలను వెల్లడిస్తున్న ఎఫ్‌ట్యాప్సీ అధ్యక్షుడు రవీంద్ర మోదీ

పివికె-5 ఇంక్లైన్ భూగర్భ గనిలో ఉత్పత్తి
కొత్తగూడెం, ఆగస్టు 5: ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని పివికె-5 ఇంక్లైన్ భూగర్భ గనిలో బొగ్గు ఉత్పత్తి శుక్రవారం ప్రారంభమైంది. గత నెల 11న ఈ గనిలో విష వాయువుల లీకేజీతో ఉత్పత్తి స్తంభించినది తెలిసిందే. అయతే గురువారం మరమ్మతు పనులను అధికారులు పూర్తిచేశారు. దీంతో శుక్రవారం మొదటి షిఫ్ట్‌లో 292 టన్నుల ఉత్పత్తిని కార్మికులు సాధించారు.
కాల్‌డ్రాప్‌కు వొడాఫోన్
10 నిమిషాల ఉచిత టాక్ టైమ్!
న్యూఢిల్లీ, ఆగస్టు 5: ప్రముఖ ప్రైవేట్‌రంగ టెలికామ్ సంస్థ వొడాఫోన్.. శుక్రవారం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఏ కారణం చేతనైనా కస్టమర్లు మాట్లాడేటప్పుడు అంతరాయం (కాల్ కట్ అయితే) కలిగితే ఉచితంగా 10 నిమిషాల టాక్‌టైమ్ ఆఫర్ చేసింది. ఈ మేరకు ఓ ప్రకటనలో వొడాఫోన్ ఇండియా స్పష్టం చేసింది. ఱఉఉ్గ అని 199 నెంబర్‌కు ఎస్‌ఎమ్‌ఎస్ చేస్తే కస్టమర్లకు 10 నిమిషాల ఉచిత టాక్‌టైమ్ వారి ఖాతాల్లోకి వచ్చి చేరుతుందని సంస్థ వివరించింది. కాల్‌డ్రాప్స్ సమస్య ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో వొడాఫోన్ తీసుకున్న తాజా నిర్ణయం భారతీయ టెలికామ్ రంగంలో సంచలనం సృష్టిస్తోంది.
ఎయిర్‌టెల్ అపరిమిత కాల్స్
న్యూఢిల్లీ, ఆగస్టు 5: మొబైల్ సేవల విపణిలో తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో దేశీయ టెలికామ్ రంగ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్.. శుక్రవారం నూతన పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను పరిచయం చేసింది. ఇందులో 1,199 రూపాయలకే 3జి/4జి డేటాతో అపరిమిత మొబైల్ కాల్స్ ఆఫర్ కూడా ఉంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్-లోకల్, ఎస్‌టిడి, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు, 1జిబి 3జి/4జి డేటా, వింక్ మ్యూజిక్, వింక్ మూవీస్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్ సౌకర్యాలూ ఉన్నాయి. 1,599 రూపాయల మరో ప్లాన్‌లో వీటన్నిటితోపాటు