బిజినెస్

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 5: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలను అందుకున్నాయి. యూరోపియన్ యూనియన్ (ఈయు) నుంచి బ్రిటన్ వైదొలిగిన (బ్రెగ్జిట్) నేపథ్యంలో ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ తాజాగా ప్రకటించిన ఉద్దీపనలు మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచాయి. వడ్డీరేట్లను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం, విదేశీ మదుపరుల నుంచి వచ్చిన పెట్టుబడులు భారతీయ స్టాక్ మార్కెట్లను లాభాల్లో పరుగులు పెట్టించాయి. అలాగే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లుకు రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదం పలకడం కూడా కలిసొచ్చింది. అటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచీ సానుకూల సంకేతాలు వచ్చాయి. ఈ క్రమంలోనే దేశీయ మదుపరులూ పెట్టుబడులపట్ల ఆసక్తి కనబరిచారు. మొత్తానికి గురువారమే మార్కెట్లు వరుస నష్టాల నుంచి కోలుకున్నప్పటికీ శుక్రవారం పెద్ద ఎత్తున లాభాలను సంతరించుకున్నాయి. ఉదయం ఆరంభం నుంచే లాభాల్లో కదలాడిన సూచీలు.. చివర్లో మరింతగా పుంజుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 231 పాయింట్లు, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 78 పాయింట్ల లాభంతో మొదలయ్యాయి. మదుపరుల పెట్టుబడుల జోరుతో చివరకు సెనె్సక్స్ 363.98 పాయింట్లు పెరిగి 28,078.35 వద్ద ముగియగా, నిఫ్టీ 132.05 పాయింట్లు ఎగిసి 8,683.15 వద్ద నిలిచింది. ఆటో షేర్లు మదుపరులను అమితంగా ఆకట్టుకున్నాయి.