బిజినెస్

ఇసుక నింపటమే కోతకు పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 23: విశాఖ ఆర్‌కె బీచ్ కోత నివారణకు ఇసుక నింపటం (డంపింగ్) ఒక్కటే పరిష్కారం కాగలదని స్పష్టమైంది. బీచ్ కోతను నివారించేందుకు తాత్కాలిక, శాశ్వత ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న యంత్రాంగం తాజాగా విదేశీ సంస్థ అధ్యయనం మేరకు తీరంలో భారీస్థాయిలో ఇసుక నింపేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే చెన్నైకి చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఓటి) కోత నివారణకు తాత్కాలిక, శాశ్వత పరిష్కారాను వివరిస్తూ నివేదిక అందజేసింది. అయితే బీచ్‌కోతను నివారించేందుకు ఎన్‌ఐఓటి ఇచ్చిన నివేదిక మేరకు ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ఇదే సందర్భంలో నెదర్లాండ్స్‌కు చెందిన డెల్టారిస్ సంస్థ విశాఖ బీచ్ కోత నివారణ అంశంపై పూర్తి అధ్యయనం చేసింది. గత చరిత్ర ఆధారంగా కోతపై అధ్యయనం చేసిన ఈ సంస్థ కోతకు కారణాలు అనే్వషించింది. ముఖ్యంగా విశాఖ తీరంలో అలల తాకిడికి ఇసుక సముద్రంలోకి వెళ్లిపోతోందని గుర్తించింది. తీరంలో ఇసుక మేటలు క్రమంగా సముద్రంలోకి పోవడం వల్లే ఒడ్డు కోతకు గురవుతోందని గుర్తించింది. దీన్ని నియంత్రించేందుకు ఎటువంటి కట్టడాలు అవసరం లేదని అభిప్రాయపడింది. శాశ్వత నివారణలో భాగంగా కట్టడాలను నిర్మించినప్పటికీ కోతను నివరించలేమని స్పష్టంగా పేర్కొంది. ఈ సమస్యకు ఇసుక మేటలను తీరానికి తరలించడం ఒక్కటే పరిష్కారంగా పేర్కొంది. ఇదే అంశంపై డెల్టారిస్ సంస్థ అన్ని ఆధారలతో జిల్లా అధికారులకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇటీవల వివరించింది కూడా. కోత నివారణ అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడంతో పాటు ఇందుకయ్యే ఖర్చును ప్రపంచ బ్యాంకు నుంచి సాయంగా పొందేందుకు అవసరమైన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. గతంలో ఎన్‌ఐఓటి నివేదిక ఆధారంగా జియో ట్యూబ్‌ల ఏర్పాటు వల్ల కూడా కోత నివారణ పూర్తి స్థాయిలో సాధ్యం కాదన్న వాస్తవం వెల్లడి కావడంతో యంత్రాంగం పునరాలోచనలో పడింది.
ఇప్పటికే విశాఖపట్నం పోర్టుట్రస్టు ఆధ్వర్యంలో బీచ్‌కోత నివారణ చర్యల్లో భాగంగా ఇసుక తరలింపు ముమ్మరంగా సాగుతోంది. డెల్టారిస్ సంస్థ నివేదిక ప్రకారం కూడా ఇది అత్యవసరంగా భావించిన పోర్టు అందుకు తగినట్టుగానే 4.5 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తీరానికి తరలించేందుకు వీలుగా డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటి వరకూ 1.5 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తీరానికి తరలించారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్) పనులు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో తీరానికి ఇసుక చేర్చే పనులు కూడా వేగంగానే సాగుతున్నాయి. ఐఎఫ్‌ఆర్ పూర్తయిన తర్వాత మరింత ముమ్మరంగా తీరానికి ఇసుక తరలించే పనులు చేపడతామని అధికారులు పేర్కొంటున్నారు.