బిజినెస్

అమరావతిలో విజ్ఞాన ఆర్థిక మండలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 7: ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకి అభివృద్ధి చెందుతున్న విజ్ఞానాన్ని అందిపుచ్చుకుని దాన్ని రాష్ట్భ్రావృద్ధికి ఉపయోగించుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుంటారు. అదే క్రమంలో నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో విజ్ఞాన ఆర్థిక మండలి (నాలెడ్జ్ ఎకానమీ జోన్ - కెఇజెడ్) ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయించారు. ప్రపంచంలోనే తొలి ప్రయోగాత్మక ప్రాజెక్టుగా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చేపడుతోంది. విజ్ఞాన ఆర్థికమండలి అనే దాన్ని మనం తొలిసారిగా వింటున్నాం. సంపదను సృష్టించడంలో విజ్ఞానాన్ని కూడా వినియోగించుకోవచ్చని గుర్తించడమే ఇక్కడ ప్రత్యేకత. దీని ప్రాధాన్యతను సిఐఐ ప్రతినిధి బృందం గతంలో సిఎంను కలిసి వివరించింది. అప్పుడే ఇటువంటి మండలిని ఏర్పాటుచేయాలన్న నిర్ణయానికి సిఎం వచ్చారు. విజ్ఞానాధారిత ఆర్థికాభివృద్ధి సాధించాలన్న తపనతో సిఐఐ (్భరత పరిశ్రమల సమాఖ్య), హార్వర్డ్ విశ్వవిద్యాలయం, ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) సహకారంతో దీన్ని నెలకొల్పనుంది. దీని పనులు ఈ ఏడాది ప్రారంభించి, వచ్చే ఏడాది నాటికి దీని తొలి దశను పూర్తిచేయాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. తొలిదశలో 10ఎకరాల్లో దీన్ని ప్రారంభిస్తారు. క్రమంగా 2019 నాటికి ఈ ప్రాజెక్టు వంద ఎకరాలకు విస్తరిస్తుంది.
ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని అన్ని అంశాల్లో వినియోగిస్తున్న విధంగానే ఆర్థికాభివృద్ధికి ఉపయోగించుకోవాలన్నది ప్రభుత్వం ఆలోచన. సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రయోగాత్మకంగా ఆర్థిక అంశాలకు జోడిస్తారు. స్థిరమైన వృద్ధి సాధించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇప్పటికే రాష్ట్రం 10.99 శాతం వృద్ధిరేటు సాధించి దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ వృద్ధి రేటును క్రమంగా పెంచుతూ స్థిరమైన వృద్ధిని సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. విజ్ఞాన ఆర్థిక మండలి స్థాపనలో ప్రపంచంలోని శాస్త్ర, సాంకేతిక, ఆర్థిక రంగాలకు చెందిన నిపుణుల సలహాలను తీసుకుంటారు. ఈ మండలికి కావలసిన అన్ని రకాల వౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తుంది. ఈ మండలి స్థాపన ఉద్దేశాలు విజయవంతంగా అమలైతే రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది.
కెఇజెడ్ భవిష్యత్‌లో ఆర్థిక వృద్ధిలోనే కాకుండా, పరిపాలనా వ్యవహారాల్లో కూడా కీలకంగా మారుతుందని నిపుణుల అభిప్రాయం. అమరావతిలో ప్రారంభమైన తరువాత రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కూడా ఇటువంటి విజ్ఞాన ఆర్థిక మండళ్లు ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇందుకు కావలసిన ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది.