బిజినెస్

సంస్కరణల ఘనత సమాజానిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 7: రాజకీయ నేతలు సంస్కరణలు సమర్థించేలా చేసిన ఘనత ఆకాంక్షలతో కూడిన సమాజానిదేనని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆదివారం అంటూ, ప్రపంచ ఆర్థిక మాంద్యం, భౌగోళిక- రాజకీయ ఉద్రిక్తతలను అధిగమించి భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ఇప్పుడు సిద్ధంగా ఉందన్నారు. అయితే అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా జనాభా పెరుగుదలను అదుపు చేయగలిగితే, భారత దేశం మాత్రం తన జనాభా స్థిరీకరణ లక్ష్యాలను చేరుకోలేక పోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. పారిశ్రామిక, సాంకేతిక విప్లవాల విషయానికి వచ్చేసరికి నారతీయుల సంప్రదాయాల ఆలోచన కారణంగానే భారత్ గతంలో అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోలేక పోయిందని జైట్లీ అంటూ, అయితే భారతీయులు ఇప్పుడు ఆకాంక్షలతో నిండిన వారుగా మారారని, ఫలితంగా రాజకీయవేత్తలు సంస్కరణల చర్యలను సమర్థించేలా వారిపై ఒత్తిడి తెస్తున్నారని అన్నారు.
మొత్తం ప్రపంచం ఆర్థిక మాంద్యం స్థితిలో ఉందని, ఈ పరిస్థితిలో ఏదయినా ఒక దేశం 1.5-2 శాతం వృద్ధి సాధించినా అది నెగెటివ్ జోన్‌లో లేదన్న సంతృప్తినిస్తుందని జైట్లీ అన్నారు. అయితే భారత దేశం చరిత్రలో మొట్టమొదటిసారి ఈ ధోరణిని అధిగమిస్తోందని, గతంలో ఎన్నో చారిఅతక అవకాశాలను వదులుకొన్నప్పటికీ మిగతా ప్రపంచంకన్నా మెరుగైన వృద్ధిని సాధిస్తోందని ఓ.పి జిందాల్ గ్లోబల్ యూనివర్శిటీ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ జైట్లీ అన్నారు. దేశం అభివృద్ధి చెందాలనే బలమైన అభిప్రాయం దేశ ప్రజల్లో ఉందని జైట్లీ చెప్పారు. రెండు చరిత్రాత్మక చట్టాలు- దివాలా చట్టం, జిఎస్‌టిలు- ఏకగ్రీవంగా ఆమోదం పొందాయని, మనం ఆర్థిక మాంద్యంలోకి జారుకోకూడదని, అవకాశాలను చేజార్చుకోకూడదన్న బలమైన కోరిక ఇప్పుడు ప్రజల్లో ఉందని, అదే రాజకీయ నేతలపై ఒత్తిడి తీసుకు వస్తోందని ఆర్థిక మంత్రి చెప్పారు.