బిజినెస్

మొబైల్ ఇంటర్నెట్ డేటా ప్యాకేజీల చెల్లుబాటు గడువు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 19: టెలికామ్ రెగ్యులేటర్ ట్రాయ్.. మొబైల్ ఇంటర్నెట్ డేటా ప్యాక్స్ చెల్లుబాటు గడువును పొడిగించింది. ప్రస్తుతం గరిష్ఠంగా 90 రోజులు మాత్రమే చెల్లుబాటు అవుతున్న ఈ ప్యాక్‌లు.. ఇకపై 365 రోజులపాటు (సంవత్సరం) చెల్లుబాటు అవుతాయి. ఈ మేరకు శుక్రవారం ట్రాయ్ అనుమతిచ్చింది. దీంతో ఇప్పటిదాకా తక్కువగా మొబైల్ ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నవారి సంఖ్య ఇకపై పెరగనుండగా, కొత్తగా ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య కూడా పెరగనుంది. డేటా ప్యాక్స్ చెల్లుబాటు గడువును పెంచాలన్న విజ్ఞప్తులు పెద్ద ఎత్తున రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రాయ్ తెలిపింది. అయితే కేవలం డేటా ప్రయోజనాలను మాత్రమే కలిగి ఉన్న ప్రత్యేక టారీఫ్ ఓచర్ల (ఎస్‌టివి)కే ఈ చెల్లుబాటు గడువు పెంపు వర్తిస్తుందని ట్రాయ్ స్పష్టం చేసింది.