బిజినెస్

ఎల్‌జి, సామ్‌సంగ్ 4జి మొబైల్స్‌కూ రిలయన్స్ జియో సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 19: త్వరలో తమ టెలికామ్ వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించనున్న రిలయన్స్ జియో.. సామ్‌సంగ్, ఎల్‌జి 4జి స్మార్ట్ఫోన్లపైనా తమ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం సిగ్నల్ టెస్టింగ్‌లో ఉన్న రిలయన్స్ జియో.. ఇప్పటిదాకా తమ నెట్‌వర్క్ సేవలను సొంత ఎల్‌వైఎఫ్ మొబైల్స్ వినియోగదారులకే అందిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు సామ్‌సంగ్, ఎల్‌జికి చెందిన 4జి స్మార్ట్ఫోన్లలోనూ రిలయన్స్ జియో సేవలను వినియోగదారులు అందుకోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే జియో సిమ్ యాక్టివేషన్ అయిన 90 రోజులపాటే సేవలు అందుతాయని పేర్కొన్నాయి.
‘పరిశ్రమలు, వర్శిటీలు కలసి పనిచేయాలి’
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఆగస్టు 19: పరిశ్రమలు, వర్శిటీల భాగస్వామ్యం పరస్పర లాభదాయకం అవుతుందని వాషింగ్టన్‌లోని యూనివర్శిటీ ఇండస్ట్రీ డిమానిస్ట్రేషన్ పార్టనర్‌షిప్ (యుఐడిపి) అధినేత డాక్టర్ ఆంథోని బొక్కన్‌ఫుసొ అన్నారు. ఇక్ఫాయి యూనివర్శిటీ శుక్రవారం యుఎస్ కాన్సులేట్‌తో కలిసి నిర్వహించిన సదస్సులో ఆంథోని మాట్లాడారు.