బిజినెస్

ప్రతిభకు పట్టం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 21: ఉర్జిత్ పటేల్‌కున్న అనుభవం, అద్భుతమైన పనితనం, మేధోశక్తి.. గవర్నర్‌గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ)ను నడిపించడంలో ఆయనకు దోహదం చేస్తాయని నిపుణులు, ప్రముఖ ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. సవాళ్ల సమయంలో పటేల్ కేంద్ర బ్యాంక్ అధిపతిగా నియమితులయ్యారని, అయితే అన్నింటినీ ఎదుర్కొని విజయవంతంగా ముందుకెళ్లగలరన్న విశ్వాసాన్ని వారు వ్యక్తం చేశారు. శనివారం ఆర్‌బిఐ నూతన, 24వ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ ఎన్నికైనది తెలిసిందే. వచ్చే నెల (సెప్టెంబర్) 4తో ప్రస్తుత గవర్నర్ రఘురామ్ రాజన్ మూడేళ్ల పదవీకాలం ముగుస్తోంది. దీంతో ఆయన స్థానంలో ప్రస్తుత డిప్యూటీ గవర్నర్ పటేల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. డిప్యూటీ గవర్నర్‌గా పనిచేసి ఆర్‌బిఐ గవర్నర్ స్థాయికి ఎదిగినవారిలో పటేల్ 8వ వ్యక్తి. ‘ఇది సరైన నిర్ణయం. ఆర్‌బిఐ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలు అంగీకరించిన కొత్త ద్రవ్యవిధాన రూపకర్త ఉర్జిత్ పటేల్. ఎంతో నైపుణ్యం కలిగిన పటేల్‌కు బ్యాంకింగ్ రంగంలో చాలా అనుభవం ఉంది’. అని భారత సంతతికి చెందిన బ్రిటన్ రాజకీయ, ఆర్థికవేత్త మేఘ్‌నాద్ దేశాయ్ పిటిఐతో అన్నారు. ఇదేతరహా అభిప్రాయాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో ముఖ్య ఆర్థిక సలహాదారుగా పనిచేసిన పట్నాయక్ కూడా వ్యక్తం చేశారు. ‘ఆర్‌బిఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ నియామకం భారత ఆర్థిక వ్యవస్థకు లాభిస్తుంది’. అని ఫ్రాన్స్‌కు చెందిన ఆర్థికవేత్త గుయ్ సోర్మన్ అన్నారు. మరోవైపు దేశీయ బ్యాంకర్లైన ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్‌ల చీఫ్‌లూ పటేల్ నియామకంపట్ల హర్షం వ్యక్తం చేశారు. నూతన ద్రవ్యవిధానాన్ని రూపొందించడంలో పటేల్ కీలక పాత్ర వహించారని ఐసిఐసిఐ బ్యాంక్ సిఇఒ చందా కొచ్చర్ అన్నారు. చదువుపరంగా ఎంతో మేధస్సును కలిగి ఉన్న పటేల్‌కు.. ఆర్థికపరమైన అంశాలపైనా అంతే అనుభవం ఉందన్నారు యాక్సిస్ బ్యాంక్ సిఇఒ శిఖా శర్మ అన్నారు. ఎస్‌బిఐ, యెస్‌బ్యాంక్ చీఫ్‌లూ పటేల్‌ను కొనియాడారు.