బిజినెస్

‘అమరావతి’పై డెన్మార్క్ ఆసక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 23: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంపై డెన్మార్క్ ఆసక్తి కనబరుస్తోంది. బ్రిటీష్ హైకమిషన్ సహకారంతో డెన్మార్క్‌లోని బ్రిటీష్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మారియానో ఎ డేవిస్ నేతృత్వంలో డెన్మార్క్‌కు చెందిన సంస్థల ప్రతినిధుల బృందం విజయవాడకు వచ్చింది.
ఈ బృందంతో ఇక్కడ మంగళవారం ఎపిసిఆర్‌డిఎ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎపి ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు అధికారులు సమావేశమయ్యారు. కృష్ణపట్నం పోర్టు సహకారంతో జరిగిన ఈ సమావేశంలో అమరావతి రాజధాని నగరంలో పరస్పర సహకారానికి అనువైన రంగాలపై చర్చ జరిగింది.
క్లీన్‌టెక్, ఆర్‌అండ్‌డి, నాలెడ్జ్, నిర్మాణ రంగం, ఇంజనీరింగ్, స్మార్ట్ ఇన్‌ఫ్రా తదితర రంగాలకు చెందిన డెన్మార్క్ ప్రతినిధులు సమావేశంలో పాల్గొని అమరావతి రాజధాని నవ నగరాల విశిష్టతలు, అభివృద్ధి సహకారానికి అవకాశాలపై చర్చించారు. పలు రంగాల్లో సహకారానికి డెన్మార్క్ ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేశారు. కాగా, గవర్నమెంట్ టు గవర్నమెంట్, సిటీ టు సిటీ భాగస్వామ్య అవకాశాలను ఎపిసిఆర్‌డిఎ అధికారులు ఈ సందర్భంగా వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్‌కు అనుగుణంగా గ్రీన్ అండ్ బ్లూ కానె్సప్ట్‌తో అత్యాధునికంగా ప్రణాళికాబద్ధంగా రూపుదిద్దుకుంటున్న అమరావతి రాజధాని నగరంలో ఎన్నో అవకాశాలున్నాయని ఎపిసిఆర్‌డిఎ కమిషనర్ శ్రీధర్ తెలిపారు.
నవ్యాంధ్ర రాజధాని నగరం చరిత్రాత్మకమైన ప్రాంతంలో నిర్మితమవుతోందన్నారు. సారూప్యత ఉన్న ఆంధ్రప్రదేశ్, డెన్మార్క్ మధ్య భాగస్వామ్య ఆవశ్యకత ఉందని, అమరావతి రాజధాని బ్లూ గ్రీన్ సిటీ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ప్రణాళికతో నిర్మాణం జరుగుతోందన్నారు. స్మార్ట్ సిటీ ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్ కానె్సప్ట్‌పై సమావేశంలో విస్తృత చర్చ జరిగింది.
డెన్మార్క్‌కు చెందిన 12 సంస్థల ప్రతినిధులు, ఎపిసిఆర్‌డిఎ కమిషనర్ శ్రీధర్, ఎపి ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు సీనియర్ సలహాదారుడు రామనాధ్, ఎపిసిఆర్‌డిఎ ఎకనామిక్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ వై నాగిరెడ్డి, ఎపిసిఆర్‌డిఎ ఎకనామిక్ డెవలప్‌మెంట్ విభాగం అధికారులు, కృష్ణపట్నం పోర్టు జనరల్ మేనేజర్ యువి దుర్గాప్రసాద్, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.