బిజినెస్

రూ. 3 లక్షలు మించొద్దు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 23: అక్రమ సంపదకు అడ్డుకట్ట వేయడంలో భాగంగా, నగదు లావాదేవీల నియంత్రణపై దృష్టి పెట్టింది కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు. ఈ క్రమంలోనే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చేసిన సిఫార్సును పరిశీలిస్తోంది. 3 లక్షలు, అంతకంటే ఎక్కువ విలువైన నగదు లావాదేవీలను నిషేధించాలని సిట్ సిఫార్సు చేసింది. దీన్ని పరిశీలిస్తున్నామని సిబిడిటి చైర్‌పర్సన్ రాణీ సింగ్ నాయర్ మంగళవారం తెలియజేశారు.
నల్లధనంపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు.. సిట్‌ను నియమించినది తెలిసిందే. వ్యక్తిగతంగా, సంస్థాగతంగా 15 లక్షల రూపాయలకు మించి నగదును కలిగి ఉండరాదని కూడా సుప్రీం ఏర్పాటుచేసిన ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం సిఫార్సు చేసింది. ఒకవేళ ఇంతకుమించి నగదును ఉంచుకోవాలంటే స్థానిక ఆదాయ పన్ను శాఖ కమిషనర్ నుంచి ప్రత్యేక అనుమతి తప్పనిసరి అని కూడా స్పష్టం చేసింది.
ఈ నిబంధనలను మీరితే చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని కూడా తెలిపింది. దేశంలో ఉన్న కోటానుకోట్ల అక్రమ సంపదను నిర్మూలించడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని సిట్ అభిప్రాయపడగా, సిట్ సిఫార్సును పరిశీలిస్తున్నామని ఇక్కడ జరిగిన అసోచామ్ కార్యక్రమానికి విచ్చేసిన నాయర్ తెలిపారు. ఇప్పటికే నగదు లావాదేవీలపై ఆదాయ పన్ను శాఖ 1 శాతం టిసిఎస్‌ను విధించిందని, పాన్ కార్డు వినియోగాన్నీ తప్పనిసరి చేసిందని ఆమె గుర్తుచేశారు. నగదు లావాదేవీలు తగ్గి, ఎలక్ట్రానిక్ (క్రెడిట్, డెట్ కార్డులు) లావాదేవీలు పెరగడం వల్ల ప్రభుత్వానికి పన్ను ఎగవేసి పోగేసిన అక్రమ సంపద వెలుగులోకి వస్తుందని సిట్ ప్రధాన వాదన. ఈ అక్రమ సంపద పెద్ద ఎత్తున నగదు రూపంలోనే ఉందని చెబుతోంది. కాగా, నల్లధనానికి కళ్లెం వేయడానికి జస్టిస్ ఎమ్‌బి షా (రిటైర్డ్) నేతృత్వంలో ఏర్పాటైన ఈ సిట్.. గత నెల సుప్రీం కోర్టుకు తమ ఐదవ నివేదికను సమర్పించింది.
ఇదిలావుంటే పన్ను చెల్లింపుదారులకు అత్యుత్తమ సేవలను అందించడానికి, విలువైన సలహాలు ఇవ్వడానికి ఆదాయ పన్ను శాఖ అధికారులు తప్పక సహకరించాల్సి ఉంద ని నాయర్ అన్నారు. పన్నులకు సం బంధించేగాక, వారికి పన్నుల విధానంపై ఓ అవగాహనను అధికారులు కల్పించాలని సూచించారు.
ఇక వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే నూతన ఆర్థిక సంవత్సరం (2017- 18)లో పన్నుల విధానం మరింత ప్రభావవంతంగా ఉండేలా బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రూపొందిస్తున్నట్లూ నాయర్ చెప్పారు.