బిజినెస్

ఇక ‘హోప్’ ఐలాండ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఆగస్టు 24: కాకినాడ సముద్ర తీరంలో ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడిన హోప్ ఐలాండ్‌ను రానున్న రోజుల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇందుకు సంబంధించి రూ. 5.76 కోట్లతో అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచారు. ఈ నెల 29న టెండర్లు తెరవనున్నారు. హోప్ ఐలాండ్‌ను ఆకర్షణీయమైన రీతిలో తీర్చిదిద్దడానికి గతంలో సంబంధిత శాఖల అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఎకో టూరిజం క్రింద ఈ అభివృద్ధి పనులను అటవీ, పర్యాటక శాఖల ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. ప్రస్తుతం హోప్ ఐలాండ్ నుండి కోరింగ అభయారణ్యం వరకు టూరిజం కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఈ రెండూ కాకినాడ తీరంలో సహజసిద్ధమైన ప్రకృతి సౌందర్యంతో అలరారుతున్నాయి. ఇటీవలి కాలంలో హోప్ ఐలాండ్, కోరంగి అభయారణ్యాలకు పర్యాటకుల తాకిడి పెరిగింది. సముద్ర దీవి (హోప్ ఐలాండ్)ని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చినట్టయితే విదేశీ యాత్రికులను కూడా ఆకర్షించడానికి మార్గం సుగమమవుతుంది. అలాగే పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని సుందర్‌బాన్ మ్యాంగ్రోస్ (మడ అడవులు) తరువాత ఆంధ్రప్రదేశ్‌లో కోరంగి మడ అడవులకు అంతటి ప్రాముఖ్యత ఉంది. ఇక్కడి మడ అడవుల్లో పర్యటించడానికి అవకాశాలున్నప్పటికీ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పర్యాటకులను ఆకట్టుకునే రీతిలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని హోప్ ఐలాండ్, కోరంగి అభయారణ్యాలకు స్వదేశీ దర్శన్ పథకం క్రింద నిధుల మంజూరుకు కేంద్ర ప్రభుత్వం ముందుకువచ్చింది. హోప్ ఐలాండ్‌లోని సుమారు 500 ఎకరాల్లో అంతర్జాతీయ పర్యాటక ప్రాజెక్టును తీసుకురానున్నారు. అలాగే హోప్ ఐలాండ్-కోరంగి అభయారణ్యాల అభివృద్ధిలో భాగంగా సుమారు 3 వేల మందికి సరిపోయే అమ్యూజ్‌మెంట్ పార్కు, ఆక్వా, మెరైన్ పార్కు, మ్యూజియం, బోటు షికారు, సీప్లేన్ టూరిజం వంటి సౌకర్యాలు కల్పించనున్నారు. ఎకోఫ్రెండ్లీ ఫుడ్‌కోర్టులు, ల్యాండ్‌స్కేపింగ్, పిల్లల ఆటస్థలాలు, అతిథి గృహాలను నిర్మించడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు. కాగా, స్వదేశీ దర్శన్ పథకం కింద జిల్లాలోని ఆదూరు, పాశర్లపూడిలో రూ. 3 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు టెండర్లు పిలిచారు. కాగా, కాకినాడ బీచ్ అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. 2017 బీచ్ ఫెస్టివల్ నాటికి సాగర తీరాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకోవాలంది. ఇందుకు సంబంధించి రూ. 19 కోట్లు మంజూరు చేసింది.