బిజినెస్

మైక్రోమ్యాక్స్, పానసోనిక్‌ల్లోనూ రిలయన్స్ జియో ఉచిత సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 24: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని టెలికామ్ సంస్థ రిలయన్స్ జియోతో మొబైల్ తయారీ సంస్థలు మైక్రోమ్యాక్స్, పానసోనిక్.. ఉచిత వాయిస్, డేటా సేవల కోసం భాగస్వామ్యాన్ని చేసుకున్నాయి.
దీంతో మైక్రోమ్యాక్స్, పానసోనిక్ 4జి స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేసినవారికి 90 రోజులపాటు ఉచితంగా 4జి సేవలు అందుతాయి. ఇప్పటికే సామ్‌సంగ్, ఎల్‌జి మొబైల్స్‌తోనూ జియో ఇదే తరహా ఒప్పందాన్ని కుదుర్చుకున్నది తెలిసిందే. కగా, ఈ మొబైల్స్‌ను కొన్నవారు రిలయన్స్ జియో 4జి సిమ్ పొందుతారు. దీనిద్వారా 90 రోజులపాటు అపరిమిత హెచ్‌డి వాయిస్, వీడియో కాలింగ్, ఎస్‌ఎమ్‌ఎస్, హై-స్పీడ్ డేటా సేవలతోపాటు జియో యాప్స్‌ను ఉచితంగా అందుకోవచ్చు. ఈ మేరకు మైక్రోమ్యాక్స్ చీఫ్ మార్కెటింగ్ అధికారి శుభజిత్ సేన్ చెప్పారు. మైక్రోమ్యాక్స్ అనుబంధ సంస్థ వైయు కూడా ఏ వైయు స్మార్ట్ఫోన్‌ను కొన్నా తక్షణమే ఉచిత వాయిస్, డేటా సేవలను అందుకోవచ్చని ప్రకటించింది. ‘2016లో విడుదలైన మా అన్ని 4జి/ఎల్‌టిఇ స్మార్ట్ఫోన్లకు జియో ఉచిత వాయిస్, డేటా సేవలు వర్తిస్తాయి.’ అని పానసోనిక్ ఇండియా మొబిలిటి డివిజన్ వ్యాపార అధిపతి పంకజ్ రాణా తెలిపారు.