బిజినెస్

ఫియట్ లగ్జరీ జీపులొచ్చేశాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోధ్‌పూర్, ఆగస్టు 30: ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ (ఎఫ్‌సిఎ) ఇండియా.. మంగళవారం భారతీయ మార్కెట్‌లోకి జీప్ బ్రాండ్‌ను తీసుకొచ్చింది. రాంగ్లర్, గ్రాండ్ చెరోకీ పేరిట రెండు ఎస్‌యువి (స్పోర్ట్స్ యుటిలిటి వెహికిల్) మోడల్స్‌ను పరిచయం చేసింది. వీటిలో నాలుగు రకాలుండగా, అత్యంత లగ్జరీ వాహనమైన గ్రాండ్ చెరోకీ వేరియంట్‌లోనే మూడు రకాలున్నాయి. ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం రాంగ్లర్ ధర 71.59 లక్షల రూపాయలుగా ఉంది. అలాగే గ్రాండ్ చెరోకీలో ఎస్‌ఆర్‌టి ధర 1.12 కోట్ల రూపాయలు, 3-లీటర్ డీజిల్ పవర్డ్ సమ్మిట్ ధర 1.03 కోట్ల రూపాయలు, 3-లీటర్ 8-స్పీడ్ డీజిల్ వెర్షన్ లిమిటెడ్ ధర 93.64 లక్షల రూపాయలుగా ఉన్నాయి. ఇటలీకి చెందిన ఈ కార్ల తయారీ సంస్థ వచ్చే ఏడాది రెండో త్రైమాసికం నుంచి భారత్‌లోనే ఉత్పత్తిని ఆరంభించాలనుకుంటోంది. పుణెలోని రంజన్‌గాన్ ప్లాంట్ వద్ద తయారు చేయనున్నట్లు ఎఫ్‌సిఎ ఇండియా అధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ కెవిన్ ఫ్లిన్ తెలిపారు. ఇప్పటికే 280 మిలియన్ డాలర్లను ఈ ప్లాంట్‌లో పెట్టుబడిగా పెట్టినట్లు ఆయన చెప్పారు. కాగా, క్రిస్లర్ నుంచి వచ్చిన చారిత్రాత్మక జీప్ 75 సంవత్సరాలను పూర్తి చేసుకున్నట్లు ఈ సందర్భంగా పిటిఐకి ఫ్లిన్ తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జీప్ భారత్‌కు వచ్చిందన్నారు. ఇకపోతే జీప్ డెస్టినేషన్ స్టోర్ బ్రాండ్ క్రింద దేశవ్యాప్తంగా 10 డీలర్‌షిప్‌లను తెరవనున్నట్లు ఆయన చెప్పారు. మంగళవారం అహ్మదాబాద్‌లో తొలి ఔట్‌లెట్‌ను ప్రారంభించగా, వచ్చే నెల న్యూఢిల్లీ, చెన్నైలలో ఆరంభిస్తామన్నారు. దీపావళికి ముందే అక్టోబర్‌లో ముంబయితోపాటు ఢిల్లీలో మరో ఔట్‌లెట్‌ను తెరుస్తామని, ఆ తర్వాత హైదరాబాద్, చండీగఢ్, కొచ్చి, బెంగళూరుల్లో డీలర్‌షిప్‌లను అందుబాటులోకి తెస్తామని వివరించారు. ఇకపోతే రెండేళ్లపాటు అపరిమిత మైలేజీ వారెంటీని సంస్థ ఈ జీప్‌ల కొనుగోళ్లపై కస్టమర్లకు అందిస్తోంది. అంతేగాకుండా ఈ రెండేళ్లు ‘జీప్ అసిస్ట్’ క్రింద 24/7 హెల్ప్‌లైన్, ప్రయాణాల్లో ఏర్పడే అసౌకర్యాల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇందులోభాగంగా ప్రమాదాలు, బ్రేక్‌డౌన్లు జరిగినట్లైతే ఓ బిజినెస్ శ్రేణి విమాన టిక్కెట్ లేదా హోటల్‌లో ఉండే సదుపాయాన్ని కల్పిస్తోంది.