బిజినెస్

శ్రీసిటీని సందర్శించిన అమెరికా వాణిజ్య ప్రతినిధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యవేడు/తడ, ఆగస్టు 30: అమెరికా వాణిజ్య ప్రతినిధి ఫిలిప్ ఎ మిన్ మంగళవారం శ్రీసిటీని సందర్శించారు. ఆయనకు శ్రీసిటీ అధ్యక్షుడు రమేష్ సుబ్రహ్మణ్యం సాదర స్వాగతం పలికి శ్రీసిటీలోని వౌలిక వసతులను, పారిశ్రామిక ప్రగతిని వివరించారు. పెప్సికో, కోల్గేట్, క్యాడ్‌బర్రీ, కెలాగ్స్ వంటి భారీ పరిశ్రమలతో సహా 10కిపైగా అమెరికా కంపెనీలు ఇక్కడే ఏర్పాటయ్యాయన్నారు. శ్రీసిటీ అభివృద్ధిపథమే ఇక్కడ పెట్టుబడులకు మరింత అవకాశం కల్పిస్తుందంటూ శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి అన్నారు. పెట్టుబడుల ర్యాంకింగ్‌లో భారత్ ఉత్తమ స్థానం సంపాదించుకున్నందున పలు గ్లోబల్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు భారత్‌కు వస్తున్నాయన్నారు. ఫిలిప్ పర్యటన ఇరు దేశాల మధ్య వర్తక, వాణిజ్య సంబంధాలను మరింత మెరుగుపరచడంతోపాటు శ్రీసిటీకి ఆ దేశ సంస్థలు మరిన్ని రాగలవన్న అశాభావాన్ని వ్యక్తం చేశారు. శ్రీసిటీలో వౌలిక వసతులు ఆకట్టుకునే విధంగా ఉన్నాయని ఫిలిప్ ఎ మిన్ అన్నారు. పలు అమెరికన్ సంస్థలు ఇక్కడ ఏర్పాటుకావడం ఎంతో ఆనందదాయకమని అభిప్రాయపడ్డారు. అనంతరం ఆయన శ్రీసిటీలోని పెప్సికో, కోల్గేట్ పామోలివ్ ప్లాంట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పలు అమెరికన్ సంస్థల ప్రతినిధులు ఫిలిప్‌తో సమావేశమయ్యారు.
ఫిలిప్ ఎ మిన్‌తో శ్రీసిటీ ప్రతినిధులు