బిజినెస్

11 సిమెంట్ సంస్థలపై రూ. 6,700 కోట్ల జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 31: కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ).. బుధవారం 11 సిమెంట్ తయారీ సంస్థలపై 6,700 కోట్ల రూపాయలకుపైగా జరిమానాను విధించింది. జైప్రకాశ్ అసోసియేట్స్‌పై అత్యధికంగా 1,323.60 కోట్ల రూపాయల జరిమానా పడటం గమనార్హం. ఆ తర్వాత అల్ట్రాటెక్‌పై 1,175.49 కోట్ల రూపాయల జరిమానా వేసిన సిసిఐ.. ఎసిఎల్‌పై 1,163.91 కోట్ల రూపాయలు, ఎసిసిపై మరో 1,147.59 కోట్ల రూపాయల జరిమానా విధించింది. మార్కెట్‌లో కృత్రిమ సిమెంట్ కొరతను సృష్టించి తద్వారా ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని ఈ 11 సంస్థలపై సిసిఐ మొత్తం 6,715 కోట్ల రూపాయల జరిమానా విధించింది. జరిమానా పడిన సంస్థల్లో లఫర్జ్ (రూ. 490.01 కోట్లు), సెంచూరి (రూ. 274.02 కోట్లు), రామ్‌కో (రూ. 258.63 కోట్లు), ఇండియా సిమెంట్స్ (రూ. 187.48 కోట్లు), బినాని (రూ. 167.32 కోట్లు), జెకె సిమెంట్స్ (రూ. 128.54 కోట్లు) ఉన్నాయి. సిమెంట్ తయారీ సంఘం (సిఎమ్‌ఎ)పైనా 73 లక్షల రూపాయల జరిమానాను సిసిఐ వేసింది. ధరలకు సంబంధించి ఈ సంస్థలు ఎలాంటి ఒప్పందాలు, అవగాహనలకు వచ్చినా వాటిని వెంటనే రద్దు చేసుకోవాలని ఈ సందర్భంగా సిసిఐ స్పష్టం చేసింది. సిఎమ్‌ఎతోపాటు వివిధ సంస్థలపై ఇంత భారీ స్థాయిలో జరిమానా విధించడానికి కారణం వినియోగదారులు నష్టపోతారని మాత్రమే కాదని.. నిర్మాణ, వౌలిక రంగాల అభివృద్ధిలో సిమెంట్ కీలకమని, దేశ ఆర్థిక వ్యవస్థపైనే సిమెంట్ ధరల ప్రభావం ఉంటుంది కాబట్టి కఠినంగా స్పందించాల్సి వచ్చిందని సిసిఐ తెలిపింది. మరోవైపు మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార కార్యకలా పాలను నిర్వర్తిస్తోందని శ్రీ సిమెంట్ లిమిటెడ్‌పై 397.51 కోట్ల రూపాయల జరిమానాను కూడా సిసిఐ విధించింది.