బిజినెస్

కేశనపల్లి బావిలో చమురు నిక్షేపాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మామిడికుదురు, ఆగస్టు 31: కేశనపల్లి స్ట్రక్చర్ పరిధిలోని గొల్లపాలెం గ్రామంలో ప్రభుత్వరంగ ఒఎన్‌జిసి సంస్థ నిర్వహించిన డ్రిల్లింగ్‌లో అపార చమురు నిక్షేపాలు బయటపడ్డాయి. ఇ-1400-17 రిగ్గుతో ఇక్కడ డ్రిల్లింగ్ నిర్వహించారు. 3,500 మీటర్ల మేర డ్రిల్లింగ్ అనంతరం బహుళ జోన్లతో కూడిన రిజర్వాయర్లు వెలికిచూశాయి. వీటిలో 35 సంవత్సరాల వరకు వినియోగించుకునే సామర్థ్యం ఉంది. నిత్యం లక్ష లీటర్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉన్న ఈ బావిని ఒఎన్‌జిసి త్వరలో వినియోగంలోకి తేనుంది. ఈ సైట్‌లో డ్రిల్లింగ్ పూర్తి కావడంతో రిగ్‌ను శంకరగుప్తం సైట్‌కు తరలించనున్నారు. కెజి బేసిన్‌కు చమురు ఉత్పత్తిలో కేశనపల్లి స్ట్రక్చర్ తలమానికంగా ఉంది. కాగా, మరిన్ని బావులు బయల్పడుతుండటంతో ఒఎన్‌జిసి వర్గాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిస్తున్నాయి.