బిజినెస్

నాణ్యత లేకపోతే నిషేధమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 25: నాణ్యతాపరమైన అంశాలపై మరోసారి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌ను అమెరికా ఆహార, ఔషధ అడ్మినిస్ట్రేషన్ (యుఎస్ ఎఫ్‌డిఎ) హెచ్చరించింది. లోపాలను సరిదిద్దుకోకపోతే ఇకపై తమ దేశానికి వచ్చే ఔషధాలకు ఆమోదం తెలిపేది లేదని, దిగుమతులను నిలిపివేస్తామని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఓ హెచ్చరిక లేఖను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌కు యుఎస్ ఎఫ్‌డిఎ అందించింది. ప్రస్తుతం ఔషధాలను తయారు చేస్తున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని మూడు రెడ్డీస్ ల్యాబ్‌లలో సిజిఎంపి నాణ్యాతా ప్రమాణాలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించామని యుఎస్ ఎఫ్‌డిఎ పేర్కొంది. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగనిపక్షంలో నిషేధం తప్పదని హెచ్చరించింది. మరోవైపు దీనిపై డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ యుఎస్ ఎఫ్‌డిఎకు ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చే పనిలోనే ఉన్నామని, హెచ్చరిక లేఖను అందుకున్న 15 రోజుల్లో స్పందించాలన్నది గడువుగా ఉందని చెప్పారు.
మేక్ ఇన్ ఇండియాకు ఆటంకం
ప్రత్యేక ఆర్థిక మండళ్ళ (సెజ్ లేదా ఎస్‌ఇజెడ్) కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్‌సెట్ క్లాజ్ మేక్ ఇన్ ఇండియాకు విఘాతం కలిగించేదిగా ఉందని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ అభిప్రాయపడింది. 2017 మార్చి నుంచి దీన్ని అమల్లోకి తీసుకురావాలన్న నిర్ణయాన్ని కేంద్రం మరికొనే్నళ్లు వాయిదా వేసుకోవడం మంచిదని సంస్థ అధ్యక్షుడు, సిఎఫ్‌ఒ సౌమెన్ చక్రబర్తి అభిప్రాయపడ్డారు. పెట్టుబడుల దృష్ట్యా దీన్ని ఆలోచించాలని అన్నారు. అయితే పన్నుల చట్టాల సరళీకరణను ఆయన స్వాగతించారు.