బిజినెస్

క్షీణించిన చైనా ఎగుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, సెప్టెంబర్ 9: ప్రపంచంలో అతిపెద్ద ఎగుమతిదారుగా కొనసాగుతున్న చైనాను కష్టాలు వెంటాడుతున్నాయి. విదేశీ మార్కెట్లలో డిమాండ్ సరిగా లేకపోవడంతో గత నెలలో చైనా ఎగుమతులు క్షీణించినట్లు అధికారులు గురువారం వెల్లడించారు. అమెరికా డాలర్ల పరంగా ఏడాది క్రితం ఇదే కాలంలో చైనా నుంచి జరిగిన ఎగుమతులతో పోలిస్తే ఆగస్టులో ఎగుమతులు 2.8 శాతం మేరకు క్షీణించాయని జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ విభాగం పేర్కొంది. అయితే ఈ ఏడాది జూలైలో 12.5 శాతం మేరకు తగ్గిన చైనా దిగుమతులు ఆగస్టులో 1.5 శాతం పెరిగాయి. దీంతో జూలైలో 52.3 బిలియన్ డాలర్లుగా ఉన్న చైనా వాణిజ్య మిగులు ఆగస్టులో 52.05 శాతానికి తగ్గిందని అధికారులు తెలిపారు. అయితే యువాన్ల (చైనా కరెన్సీ) పరంగా చూస్తే ఈ ఏడాది ఆగస్టులో చైనా ఎగుమతులు 5.9 శాతం, దిగుమతులు 10.8 శాతం పెరిగినట్లు ఆ దేశ అధికార వార్తా సంస్థ పేర్కొంది. ఎగుమతుల క్షీణత కొనసాగుతున్న నేపథ్యంలో ఎగుమతిదారుల మధ్య పోటీని పెంచేందుకు చైనా గత ఏడాది తమ కరెన్సీ విలువను 4 శాతం తగ్గించినప్పటి నుంచి డాలర్‌తో పోలిస్తే యువాన్ తీవ్రమైన వత్తిడులను ఎదుర్కొంటోంది.