బిజినెస్

రికార్డు స్థాయికి ఫారెక్స్ నిల్వలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 9: దేశంలో విదేశీ కరెన్సీ నిల్వలు సెప్టెంబర్ 2తో ముగిసిన వారానికి 367.76 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రధాన విదేశీ కరెన్సీల రాకడ గణనీయంగా పెరగడంతో అంతకు ముందు వారంకన్నా 98.95 కోట్ల డాలర్ల మేరకు విదేశీ ద్రవ్య నిల్వలు పెరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం తెలిపింది. అంతకు ముందు వారంలో విదేశీ ద్రవ్య నిల్వలు 39.26 కోట్ల డాలర్ల మేర తగ్గి 366.77 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. గతంలో విదేశీ ద్రవ్య నిల్వల ఆల్‌టైమ్ హై రికార్డు 367.16 బిలియన్ డాలర్లుగా ఉండగా ఇప్పుడు ఆ రికార్డును అధిగమించాయి. ఈ విదేశీ ద్రవ్య నిల్వల్లో పారిన్ కరెన్సీ అసెట్స్ నిల్వలు 95.22 కోట్ల మేరకు పెరిగి 342.23 బిలియన్ డాలర్లకు చేరుకోగా, బంగారం నిల్వలు సైతం 58.1 మిలియన్ డాలర్ల మేర పెరిగి 21.64 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకున్నట్లు ఆర్‌బిఐ తెలిపింది.