బిజినెస్

అడుగంటుతున్న ఆర్థిక స్వేచ్ఛ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: ప్రపంచ ఆర్థిక స్వేచ్ఛ సూచీలో మన దేశం ఇంతకు ముందున్న స్థానంనుంచి పది స్థానాలు దిగజారి 159 దేశాల్లో 112వ స్థనంలో నిలిచింది. న్యాయ వ్యవస్థ, రెగ్యులేటరీ నిబంధనలులాంటి విషయంలో ఘోరంగా విఫలం కావడమే ఈ దిగజారుడుకు ప్రధాన కారణమని ‘ఎకనామిక్ ఫ్రీడమ్ ఆఫ్ వరల్డ్: 2016 వార్షిక నివేదిక’పేర్కొంది. మన పొరుగుదేశాలయిన చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లు మన దేశంకన్నా వెనుకబడి ఉన్నప్పటికీ శ్రీలంక, భూటాన్, నేపాల్ దేశాలు మనకన్నా మెరుగైన స్థితిలో ఉండడం గమనార్హం. చైనా 113వ స్థానంలో ఉండగా బంగ్లాదేశ్ 121, పాకిస్తాన్ 133వ స్థానంలో ఉన్నాయి. కాగా, భూటాన్ 78వ స్థానంలో, నేపాల్ 108, శ్రీలంక 1110 స్థానంలో నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే హాంకాంగ్‌లో అత్యధిక ఆర్థిక స్వేచ్ఛ ఉండగా, సింగపూర్, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, కెనడా, జార్జియా, ఐర్లాండ్, మారిషస్, యుఏఇ, ఆస్ట్రేలియా,బ్రిటన్‌లు వరసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కాగా, ఈ జాబితాలో ఇరాన్ అట్టడుగున ఉంది. కెనడాకు చెందిన ఫ్రేజర్ ఇన్‌స్టిట్యూట్‌తో కలిసి మన దేశానికి చెందిన సెంటర్ ఫర్ సివిల్ సొసైటీ ఈ నివేదికను రూపొందించింది.