బిజినెస్

పర్యాటకానికి ప్రత్యేక బోర్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబరు 16: రాష్ట్రంలో పర్యాటకరంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు సింగపూర్, శ్రీలంక, మలేషియా తరహాలో ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంస్కృతి, పురావస్తు, వారసత్వ సంపద, పర్యాటక, ఆహారం, ఆతిథ్యం తదితర శాఖలను అనుసంధానం చేస్తూ ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. శుక్రవారం రాత్రి విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో అధికారులు ముఖ్యమంత్రి ఎదుట పలు ప్రతిపాదనలు ఉంచారు. దేశంలో ఛత్తీస్‌గడ్, ఉత్తరాంచల్, పంజాబ్ రాష్ట్రాల్లో కూడా ఈ తరహా పర్యాటక బోర్డులను ఏర్పాటు చేశారని, మన రాష్ట్రంలో కూడా ఇప్పుడున్న వ్యవస్థ స్థానంలో బోర్డును ఏర్పాటు చేయడం వలన శీఘ్రగతిన ప్రణాళికలను అమలు చేయగలుతామని అధికారులు వివరించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన బోర్డు ఏర్పాటు చేసి, దానికి దిగువ స్థాయిలో అథారిటీలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై కూలంకష చర్చ జరిగింది. టూరిజం బోర్డుల సంస్థాగత నిర్మాణం ఏవిధంగా ఉందో తెలుసుకుని, ఉత్తమ పద్ధతులను ఇక్కడ అమలు చేస్తే బాగుంటుందని సిఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్ర పర్యాటక శాఖ, ఏపిటిడిసి స్థానంలో స్వయం ప్రతిపత్తితో స్వతంత్రంగా పనిచేసే బోర్డును ఏఱ్పటు చేసుకోవడం వలన రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి వేగంగా జరుగుతుందని సిఎం అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా జిల్లా, నగర స్థాయిల్లో టూరిజం కౌన్సిల్స్‌ను ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో ప్రాథమికంగా నిర్ణయించారు. పరిమిత స్థాయిలో ఉండే పర్యాటక ప్రాజెక్ట్‌లపై జిల్లా, సిటీ టూరిజం కౌన్సిల్స్ నిర్ణయం తీసుకుంటాయని, ఒక స్థాయికి మించిన ప్రాజెక్ట్‌లపై రాష్ట్ర స్థాయి కౌన్సిల్ బాధ్యత చేపడుతుందని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. రాజమండ్రి, అమరావతి, విశాఖ, తిరుపతి, నగరాల్లో సిటీ టూరిజం కౌన్సిల్స్ ఏర్పాటు చేయాలని సిఎం అధికారులకు ఆదేశించారు. భవానీద్వీపం, అఖండ గోదావరిలోని ద్వాపాలలో పర్యాటకాభివృద్ధిపై దృష్టిపెట్టాలని అన్నారు. అవసరమైతే స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా ఈ ప్రాజెక్ట్‌ల అభివృద్ధిని చేపట్టాలని సిఎం ఆదేశించారు. భవానీద్వీపం, కృష్ణా రివర్‌ఫ్రంట్ డవలప్‌మెంట్ కోసం మాస్టర్ ప్లాన్ కన్సల్టెంట్లను నియమించుకోవాలని ఆయన సూచించారు. ఐఎన్‌ఎస్ విరాట్ వలన రాష్ట్రంలో పర్యాటకరంగం ఊపందుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఏపిటిడిసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 39 ప్రాజెక్ట్‌లను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించాలని ముఖ్యమంత్రి సూచించారు. సాగర్‌మాల ప్రాజెక్ట్ కింద భారత ప్రభుత్వ భాగస్వామ్యంతో 164.33 కోట్ల వ్యయంతో తొమ్మిది జెట్టీల నిర్మాణానికి రాష్ట్ర వాటాగా 82.15 కోట్ల రూపాయలు మంజూరు చేయడానికి సిఎం అంగీకరించారు. రాష్ట్ర పర్యాటక శాఖ, ఏపిటిడిసిలకు విజయవాడ బందరు కాలువకు సమీపంలో మున్సిపల్ కార్పొరేషన్ మంజూరు చేసిన స్థలంలో తాత్కాలిక కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలని సిఎం ఆదేశాలు జారీ చేశారు. జాతీయ, అంతర్జాతీయ టూరిజం ఫెస్టివల్స్‌లో ఏపి టూరిజం భాగస్వామ్యం కావాలని, రాష్ట్రంలో కూడా పలు టూరిజం ఫెస్టివల్స్‌ను ఘనంగా నిర్వహించాలని సిఎం ఆదేశించారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లోని ప్రత్యేక వంటకాలను అంతర్జాతీయంగా బ్రాండింగ్ చేయాలని సిఎం సూచించారు. ఏపి టూరిజం కోసం ప్రత్యేక లోగో తయారు చేసేందుకు పోటీ నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శులు సాయి ప్రసాద్, నాగులాపల్లి శ్రీకాంత్, టూరిజం కమిషనర్ గిరిజా శంకర్ పాల్గొన్నారు.