బిజినెస్

మూడో రోజూ అదే జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 16: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందన్న భయాలతో వారం ప్రారంభంలో భారీగా నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు వారం చివరి నాటికి ఓ మోస్తరుగా కోలుకున్నాయి. శుక్రవారం వరసగా మూడో రోజు కూడా సెనె్సక్స్ 186 పాయింట్లు లాభపడి వారం రోజుల గరిష్ఠ స్థాయి అయిన 28,599.03 పాయింట్లకు చేరుకుంది. అమెరికా ఆర్థిక గణాంకాలు అంచనాలకన్నా తక్కువగా ఉండడంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ నెలలో వడ్డీ రేట్లు పెంచుతున్న భయాలు తొలగిపోయిన కారణంగా గురువారం అమెరికా ప్రధాన సూచీలు లాభాలతో ముగిశాయి. దీనికి అనుగుణంగా ప్రధాన ఆసియా మార్కెట్లు శుక్రవారం ప్రారంభంనుంచే లాభాల్లో సాగాయి. అయితే పై స్థాయిలో లాభాల స్వీకరణకు తోడు మధ్యాహ్నం తర్వాత ఐరోపా మార్కెట్లు ప్రారంభంలో నష్టాల్లో సాగడంతో అప్పటివరకు ఆర్జించిన లాభాల్లో సగం ఆవిరై పోయాయి. అయితే ఈ వారం మొత్తంలో సెనె్సక్స్ 198.22 పాయింట్లు, నిఫ్టీ 86.85 పాయింట్లు నష్టపోయాయి. కాగా, శుక్రవారం బిఎస్‌ఇ సెనె్సక్స్ 186.14 పాయింట్లు లాభపడి 28,599.03 పాయింట్ల వద్ద ముగిసింది. సెప్టెంబర్ 9 తర్వాత సెనె్సక్స్ గరిష్ఠ స్థాయి ఇదే కావడం గమనార్హం. ఇక జాతీయ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ ఒక దశలో తిరిగి 8,800 పాయింట్ల స్థాయిని దాటినప్పటికీ అమ్మకాల ఒత్తిడితో దాన్ని నిలబెట్టుకోలేక చివరికి 37.30 పాయింట్ల లాభంతో 8,779.85 పాయింట్ల వద్ద ముగిసింది. లాభాలు ఆర్జించిన వాటిలో మారుతి అగ్రస్థానంలో ఉండగా, యాక్సిస్ బ్యాంక్, ఐటిసి, ఇన్ఫోసిస్, హీరో మోటోకార్ప్, అదానీ పోర్ట్స్ బజాజ్ ఆటో, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, టిసిఎస్, ఒఎన్‌జిసి షేర్లు కూడా మంచి లాభాలనే ఆర్జించాయి. కాగా నష్టపోయిన వాటిలో టాటా స్టీల్, టాటా మోటార్స్, ఏసియన్ పెయింట్స్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, ఎస్‌బిఐ ఉన్నాయి. బిఎస్‌ఇలోని మొత్తం 30 కంపెనీల షేర్లలో 22 లాభాలతో ముగియగా, 8 మాత్రం నష్టాలు చవి చూశాయి.