బిజినెస్

2030 తర్వాత ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, డిసెంబర్ 27: భారత్ ఆర్థిక వ్యవస్థ 2030 తర్వాత ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఓ తాజా అధ్యయనం పేర్కొంది. బ్రిటన్‌కు చెందిన సెంటర్ ఫర్ ఎకనామిక్స్ బిజినెస్ అండ్ రిసెర్చ్ (సిఇబిఆర్) నివేదిక ప్రకారం 2029లో అమెరికా ఆర్థిక వ్యవస్థను చైనా అధిగమించనుంది. ఈ క్రమంలో అమెరికా రెండో స్థానానికి పడిపోగా, భారత్ మూడో స్థానానికి చేరనుంది. 2030లో చైనా జిడిపి 34,338 బిలియన్ డాలర్లుగా, అమెరికా జిడిపి 32,996 బిలియన్ డాలర్లుగా ఉంటాయని, ఇదే సమయంలో భారత్ జిడిపి 10,133 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా వేసింది. కాగా, 2019లో బ్రిటన్‌ను వెనక్కి నెట్టి కామనె్వల్త్ దేశాల్లో భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవనుందని కూడా సిఇబిఆర్ నివేదిక పేర్కొంది. ఈ శతాబ్దం ద్వితీయార్ధంలో చైనా ఆర్థిక వ్యవస్థనూ భారత్ అధిగమిస్తుందని అభిప్రాయపడింది. ఇదిలావుంటే 2030 నాటికి బ్రిటన్ నాలుగో స్థానంలో, బ్రెజిల్ ఐదో స్థానంలో ఉండనున్నాయి. ఫ్రాన్స్ ఐదో స్థానం నుంచి తొమ్మిదో స్థానానికి పడిపోనుంది. ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో ఉన్న ఇటలీకి కూడా సమస్యలు తప్పవన్న సిఇబిఆర్.. ఐరోపాలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీ ఆధిపత్యం మాత్రం కొనసాగుతుందని చెప్పింది. ఇకపోతే రాబోయే పదిహేనేళ్లలో జి-8 దేశాల్లో భారత్, బ్రెజిల్ 3,4 స్థానాల్లో నిలుస్తాయని సిఇబిఆర్ తెలిపింది.