బిజినెస్

గడగడలాడిస్తున్న కాలుష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెనీవా, సెప్టెంబర్ 27: ప్రపంచ దేశాల్లో కాలుష్యం నానాటికీ పెరిగిపోతోందని, ప్రతి పదిమందిలో తొమ్మిది మంది చెడు గాలినే పీలుస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతి ఏటా దాదాపు 60 లక్షల మంది కాలుష్యం కారణంగా మృత్యువాత పడుతున్నారని, దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ రూపొందించిన ఈ తాజా గణాంకాలు మనమంతా తీవ్రంగా ఆందోళన చెందేలా చేస్తున్నాయని డబ్ల్యుహెచ్‌ఓ ప్రజారోగ్యం పర్యావరణ విభాగం చీఫ్ మరియా నీరా విలేఖరుల సమావేశంలో అన్నారు. కాలుష్య తీవ్రత నగరాల్లో ఎక్కువగా ఉందని, అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య చాలామంది అనుకునేదానికన్నా దారుణంగా ఉందని డబ్ల్యుహెచ్‌ఓ నిపుణులు అంటున్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే నిరుపేద దేశాల్లో గాలి మరింత కలుషితంగా ఉంటోందని, అయితే కాలుష్యం అనేది ప్రపంచంలోని అన్ని దేశాలపైన, సమాజంలోని అన్ని భాగాలపైన ప్రభావం చూపిస్తోందని మరియా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది ‘ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి’ అని ఆమె అన్నారు. కాలుష్య స్థాయిపై ఆందోళన వ్యక్తం చేసినంతమాత్రాన సరిపోదని, పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. అన్ని ప్రభుత్వాలు కూడా రోడ్లపై వాహనాల సంఖ్యను తగ్గించడం, వ్యర్థాల నిర్వహణను మెరుగుపరచడం, స్వచ్ఛ వంట ఇంధనంపై అవగాహన కల్పించాలని ఆమె అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా 3వేలకు పైగా సైట్లనుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ తాజా నివేదికను రూపొందించారు. ప్రపంచ జనాభాలో 92 శాతానికి పైగా జనం డబ్ల్యుహెచ్‌ఓ పరిమితులకు మించిన వాయునాణ్యం ఉన్న ప్రదేశాల్లోనే జీవిస్తున్నారని ఆ నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ప్రధానంగా పిఎం 2.5గా పిలవబడే ప్రమాదకరమైన సూక్ష్మకణాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. ఆరుబయటి కాలుష్యం ప్రమాదకరమే అయినప్పటికీ ఇంటిలోపలి కాలుష్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదని, ఎందుకంటే నిరుపేద వర్ధమాన దేశాల్లోని గృహాల్లో ఎక్కువ భాగం వంటకు కర్రలు, బొగ్గులాంటివే ఉపయోగిస్తారని ఆ నివేదిక పేర్కొంది. అంతేకాక వాయు కాలుష్య సంబంధిత మరణాల్లో 90 శాతం తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లోనే సంభవిస్తున్నాయని కూడా డబ్ల్యుహెచ్‌ఓ తెలిపింది. ఇంటా బయటా కాలుష్యం కారణంగా ఏటా 60 లక్షల మంది మృత్యువాత పడుతున్నారని, ఆగ్నేయాసియా, చైనా, మలేసియా, వియత్నాం లాంటి దేశాల్లో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉందని డబ్ల్యుహెచ్‌ఓ ఆ నివేదికలో తెలిపింది.
వాయు కాలుష్యం నుంచి రక్షణకోసం పాటిస్తున్న కొన్ని పద్ధతుల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని డబ్ల్యుహెచ్‌ఓ ప్రజారోగ్యం, పర్యావరణ విభాగంలో సమన్వయకర్తగా పని చేస్తున్న కార్లోస్ డోరా చెప్పారు. చైనా రాజధాని బీజింగ్‌లో అప్పుడప్పుడు జారీచేసే రోజువారీ వాయు నాణ్యత హెచ్చరికలు లాంటివి కూడా సగటు మనిషిపై పెద్దగా ప్రభావం చూపించవని ఆయన అన్నారు. అంతేకాదు వాతావరణం బాగాలేని రోజుల్లో ఇంట్లోనే ఉండడం వల్ల కూడా ఫలితం ఉండదని ఆయన అన్నారు. ముఖానికి కట్టుకునే మాస్క్‌లులాంటివి కూడా గాలిని పెద్దగా ఫిల్టర్ చేయవని పరీక్షల్లో తేలినట్లు డోరా చెప్పారు.

ప్రపంచ దేశాల్లో ఎటు చూసినా ఇవే దృశ్యాలు