బిజినెస్

6 వేల కోట్లతో బయోటెక్ పార్కులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 28: బయోటెక్నాలజీ రంగంలో పెట్టుబడులకు అత్యుత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యాచరణ రూపొందించారు. వచ్చే ఐదేళ్లలో కనీసం ఆరు వేల కోట్ల రూపాయిల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, ఐదు వేల మంది నిపుణులకు ఉద్యోగావశాకాలు కల్పించనున్నారు. బయోటెక్నాలజీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బంగారు బాతుగా మార్చుకోవాలని చూస్తోంది. ఫార్మాస్యుటికల్, డయోగ్నస్టిక్స్, అగ్రికల్చర్, పర్యావరణం సహా పలు రంగాలతో పాటు పారిశ్రామికాభివృద్ధిలోనూ బయోటెక్నాలజీ కీలకమైన పాత్ర పోషిస్తోంది. దీంతో ఈ రంగంలో విస్తృత పెట్టుబడులు పెట్టడమే గాక, ప్రైవేటు రంగం నుండి భారీగా పెట్టుబడులు ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందడంతో పాటు యువతకు భారీ సంఖ్యలో ఉద్యోగావకాశాలు దక్కుతాయని అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఫార్మా ఉత్పత్తుల్లో దేశంలో మొదటి మూడు స్థానాల్లో ఒకటిగా ఉంటూ వచ్చింది. రాష్టవ్య్రాప్తంగా 190 ఫార్మా యూనిట్లు ఉన్నాయి. వీటి ద్వారా వందల కోట్ల రూపాయిలు ఉత్పత్తులు ఏటా విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఎపిలోని 128 ఫార్మా కాలేజీల నుండి 11వేల మంది నిపుణలు వస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే బయోటెక్నాలజీ పాలసీ ఒకటి రూపొందించింది. దీని ప్రకారం వచ్చే మూడేళ్లలో మూడు మినీ లైఫ్ సైనె్సస్ పార్కులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కాకినాడ, అనంతపురంతో పాటు చిత్తూరు లేదా గుంటూరు జిల్లాల్లో ఒకటి పార్కు నిర్మిస్తారు. ఒక్కో పార్కులో 10 యూనిట్లు ఉండేలా అభివృద్ధి చేస్తారు. కాకినాడ పార్కులో మెరైన్ ఆక్వా, వ్యవసాయ రంగాలపై పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు అభివృద్ధి జరిగేలా చూస్తారు. అనంతపురంలో ఫార్మా , వాటి అనుబంధ రంగాలపై పరిశోధనలు జరిగేలా చూస్తారు. ఫుడ్ టెక్నాలజీ, వ్యవసాయం, యానిమల్ బయోటెక్నాలజీ అంశాలపై పరిశోధనలు జరిగేలా గుంటూరు లేదా చిత్తూరు సైన్స్ పార్కులను తీర్చిదిద్దుతారు. బయోటెక్నాలజీలో పరిశోధనలు, అభివృద్ధి కోసం ఐదు యూనివర్శిటీల్లో లైఫ్ సైన్స్ నాలెడ్జి సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రా యూనివర్శిటీ, కాకినాడ జెఎన్‌టియు, హార్టికల్చర్ యూనివర్శిటీ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ, తిరుపతి ఎస్వీయు యూనివర్శిటీల్లో ఈ నాలెడ్జి కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. పబ్లిక్, ప్రైవేటు పార్ట్‌నర్‌షిప్ కింద ఐదేళ్లపాటు నిర్వహించే ఈ నాలెడ్జి సెంటర్ల కోసం ఏడాదికి 20 లక్షల వంతున ఖర్చు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌కు విశాఖ నగరం బయోటెక్నాలజీ హబ్‌గా మారిపోయింది. విశాఖలోనే మెగా లైఫ్ సైన్స్ పార్కు నిర్మించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. 200 ఎకరాల్లో పబ్లిక్ ప్రైవేటు పార్టునర్‌షిప్‌తో నిర్మించే ఈ పార్కులో విస్తృతమైన ల్యాబ్ ఫెసిలిటీతో పాటు టెస్టింగ్ ల్యాబ్‌లు, ఇంక్యుబేషన్ సెంటర్, సాంకేతిక శిక్షణ కేంద్రం ఏర్పాటవుతాయి. మరో పక్క జెఎన్‌టియు కాకినాడ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీల్లో కూడాఅంకురం సంస్థలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు.

వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్‌లో మళ్లీ మార్పులు!

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 28: తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్లు మరోసారి మారనున్నాయి. రాష్ట్ర విభజన తరువాత మారడం ఇది మూడోసారి. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో రవాణశాఖ వాహనాల రిజిస్ట్రేషన్ల కోడ్‌ను మార్చేందుకు కసరత్తు పూర్తి చేసినట్టు సమాచారం. కొత్త జిల్లాలకు కేటాయించే రిజిస్ట్రేషన్ కోడ్స్‌పై ఇప్పటికే ఒక నోట్‌ను సిద్ధం చేసిన రవాణశాఖ ప్రభుత్వానికి సమర్పించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయినప్పుడు వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్స్‌ను రవాణశాఖ మరోసారి మార్చనుంది. ప్రస్తుతం తెలంగాణలో 1నుంచి 16వరకు రిజిస్ట్రేషన్ కోడ్స్ వాడుకలో ఉన్నాయి. హైదరాబాద్ జిల్లాలో 9నుంచి 14 వరకు 6 కోడ్‌లతో వెహికిల్ నెంబర్లు ఇస్తున్నారు. దసరా నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు తథ్యం అంటున్న నేపథ్యంలో రవాణశాఖ ముందుగానే కొత్త జిల్లాలకు ఏ రిజిస్ట్రేషన్ నెంబర్లు ఇవ్వాలన్న అంశంపై కసరత్తు చేసి ప్రభుత్వానికి ఓ నివేదికను పంపింది. సదరు నివేదిక ప్రకారం కొత్త జిల్లాలకు 17నుంచి 33 వరకు 17 కోడ్స్ నెంబర్లను కేటాయించారు. ఆదిలాబాద్ నుంచి కొత్తగా ఏర్పడే కొమురంభీం జిల్లా వరకు రిజిస్ట్రేషన్ కోడ్‌ను 17గా కేటాయించారు. మళ్లీ కోడ్ నెంబర్లు మారితే తెంలగాణలో 2014 నుంచి మూడోసారి వాహన రిజిస్ట్రేషన్లు మారినట్టు అవుతుంది. సమైక్య ఆంధ్రాలో కరీంనగర్‌కు కేటాయించిన కోడ్ 15 కాగా విభజన తరువాత కరీంనగర్ కోడ్ 2గా మారింది. ఇప్పుడు కరీంనగర్ నుంచి విడిపోయి కొత్త జిల్లాగా ఏర్పడే జగిత్యాలకు కొత్త కోడ్స్ రానున్నాయి. ఈ మార్పులు కొత్త వాహనదారులకు మాత్రమే వర్తిస్తాయి.

ఇ-కామర్స్ సర్వీసును
ప్రారంభించిన షాప్ ఎక్స్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 28: హైదరాబాద్ పరిసరాల్లో వినియోగదారులకు ఆన్‌లైన్ షాపింగ్ సేవలను అందించేందుకు ఎఫ్‌సి మొబైల్స్, కునాల్ మ్యూజిక్‌తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు షాప్ ఎక్స్ సంస్ధ సిఇవో అమిత్ శర్మ తెలిపారు. డెలివరీ తీసుకోవడంతో పాటుగా చెల్లింపులు చేయడం, అవసరమైన పక్షంలో తిరిగి ఇచ్చేయడం విధానలను సరళతరం చేసినట్లు ఆయన చెపప్పారు. వినియోగదారులకు సురక్షితమైన, నమ్మకమైన ఒన్ స్టాప్ షాప్‌ను వేలాది ఉత్పత్తులు, సేవల కొరకు తమ సంస్ధను తీర్చిదిద్దినట్లు ఆయన చెప్పారు. రిటైల్ సెక్టార్‌కు ఉపయోగపడే విధంగా ఈ సేవలను రూపొందించామన్నారు. 95 శాతం భారతీయ రిటైల్ సెక్టార్‌కు ఇరుగుపొరుగు దుకాణాలు వెన్నముకగా నిలుస్తున్నాయన్నారు. మొబైల్, ఎలక్ట్రానిక్‌తో పాటు ఇతర ఉత్పత్తులు, డిటిహెచ్, రీచార్జ్, బిల్లు చెల్లింపులు, టిక్కెటింగ్, డిజిటల్ యాప్స్ సేవలను పొందవచ్చన్నారు.