బిజినెస్

ధనిక నగరాల్లో ముంబయి టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: దేశంలోని సంపన్న నగరాల జాబితాలో వాణిజ్య రాజధాని ముంబయి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 820 బిలియన్ డాలర్ల సంపదను కలిగివున్న ముంబయిలో 28 మంది బిలియనీర్లు, మరో 45 వేల మంది మిలియనీర్లు ఉన్నట్లు ఒక నివేదిక స్పష్టం చేసింది. దేశంలోని అత్యంత సంపన్న నగరాల్లో ముంబయి తర్వాత ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వరుసగా రెండవ, మూడవ, నాలుగవ స్థానాలను దక్కించుకున్నాయి. మొత్తం 450 బిలియన్ల సంపదను కలిగివున్న ఢిల్లీలో 18 మంది బిలియనీర్లు, 22 వేల మంది మిలియనీర్లు ఉండగా, 320 డాలర్ల సంపదనను కలిగివున్న బెంగళూరులో 8 మంది బిలియనీర్లు, 7,500 మంది మిలియనీర్లు, 310 బిలియన్ డాలర్ల సంపదను కలిగివున్న హైదరాబాద్‌లో ఏడుగురు బిలియనీర్లు, 8,200 ంమది మిలియనీర్లు ఉన్నారని ‘న్యూ వరల్డ్ వెల్త్’ తన నివేదికలో వెల్లడించింది. వివిధ నగరాల్లోని ప్రతి ఒక్కరి వ్యక్తిగత సంపదతో పాటు నికర ఆస్తులు, అప్పులను ఆధారంగా చేసుకుని ‘న్యూ వరల్డ్ వెల్త్’ ఈ నివేదికను రూపొందించింది. ఈ ఏడాది జూన్ 1వ తేదీ నాటికి మొత్తం 5.6 ట్రిలియన్ డాలర్ల సంపదను కలిగివున్న భారత్‌లో 95 మంది బిలియనీర్లు, 2.64 లక్షల మంది మిలియనీర్లు ఉన్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. దేశంలోని ఇతర వర్థమాన సంపన్న నగరాల జాబితాలో సూరత్, అహ్మదాబాద్, విశాఖపట్నం, గోవా, చండీగఢ్, జైపూర్, వడోదర ఉన్నాయని ‘న్యూ వరల్డ్ వెల్త్’ పేర్కొంటూ, ఐటి, రియల్ ఎస్టేట్, హెల్త్‌కేర్, మీడియా, ఆర్థిక సేవల రంగాల్లో బలమైన వృద్ధితో రానున్న దశాబ్ద కాలంలో భారత్‌కు ఎంతో ప్రయోజనం చేకూరడం ఖాయమని తెలిపింది.