జాతీయ వార్తలు

బిఎస్‌ఎఫ్ విమానం కూలి 10మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: దేశ రాజధానిలోని ద్వారకా ప్రాంతంలో సరిహద్దు భద్రతా దళానికి చెందిన ఓ విమానం మంగళవారం ఉదయం కూలిపోయి 10మంది మరణించారు. కొంతమంది సాంకేతిక నిపుణులను దిల్లీ నుంచి రాంచీకి తీసుకువెళ్తుండగా సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ దుర్ఘటన జరిగినట్టు ప్రాథమిక సమాచారం.ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 10మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఉన్న ఏడుగురు అధికారులు, ముగ్గురు సాంకేతిక నిపుణులు అక్కడికక్కడే మృతి చెందినట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి మహేశ్‌శర్మ తెలిపారు. ప్రమాద ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు వెల్లడించారు. ఘటనాస్థలాన్ని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పరిశీలించనున్నారు. ఈ ప్రమాదం కారణంగా ఇవాళ ఢాకాలో జరగాల్సిన భారత్‌-బంగ్లాదేశ్‌ డీజీల స్థాయి సమావేశం రద్దయింది.