జాతీయ వార్తలు

బిల్లు కట్టకపోతే ఆస్తుల జప్తు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1029 రూపాయల కోసం ‘కలాం’కు బిఎస్‌ఎన్‌ఎల్ నోటీసు
రికవరీ అధికారి అత్యుత్సాహం
న్యూఢిల్లీ, డిసెంబర్ 4: మనిషి ఉన్నాడో లేడో.. ఆయన హోదా ఏమిటో తెలుసుకోకుండా ముక్కు పిండి మరీ బిల్లులు వసూలు చేయడం వ్యాపార సంస్థలకు ఆనవాయితీ.. నీతి నిజాయితీలకు పెట్టింది పేరుగా, చివరి వరకూ తనకంటూ ఏమి మిగుల్చుకోకుండానే తనువు చాలించిన మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం బిఎస్‌ఎన్‌ఎల్‌కు 1029రూపాయిలు బాకీ పడ్డారు. తిరువనంతపురంలోని కేరళ రాజ్‌భవన్‌లో ఆయన రెండు రోజులు ఉన్నప్పుడు చేసిన ఫోన్‌లకు సంబంధించిన బిల్లు ఇది. ఈ బాకీ మొత్తాన్ని రాబట్టేందుకు అబ్దుల్ కలాంకు సదరు బిఎస్‌ఎన్‌ఎల్ ఆపరేటర్ నోటీసు పంపాడు. అది కూడా ఆయన మరణించిన నాలుగు నెలల తర్వాత..! టెలిఫోన్ బిల్లు బాకీని కట్టక పోతే ఆస్తులు జప్తు చేసుకుంటామని కూడా గత నెల 18న పంపిన ఆ నోటీసులో హెచ్చరించాడు. ‘మీ ఫోన్ (27248000) బిల్లు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉంది. వన్‌టైమ్ సెటిల్‌మెంట్ చేసుకోండి లేకపోతే ‘రికవరీ యాక్షన్’ తీసుకుంటాం’ అని స్పష్టం చేశాడు. అంతే కాదు, బాకీ చెల్లించక పోతే ‘కలాం’ స్థిర, చరాస్థులను స్వాధీనం చేసుకోవాలని తిరువనంతపురంలోని ఓ రికవరీ అధికారికీ బిఎస్‌ఎన్‌ఎల్ నుంచి ఆదేశాలు వెళ్లాయి. కలాం ఫోన్ బిల్లు బాకీ విషయంలో తదుపరి ఇబ్బందులు లేకుండా ఆ మొత్తాన్ని చెల్లించాలని కేరళ రాజ్‌భవన్ నిర్ణయించింది. రాష్టప్రతిగా పదవీ విరమణ చేసిన తర్వాత కూడా రాజ్‌భవన్‌లోని ఓ సూట్‌లో కలాం ఉండేవారు.