బిజినెస్

లాభాల బాటలో బిఎస్‌ఎన్‌ఎల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్యసభలో వెల్లడించిన రవిశంకర్ ప్రసాద్
కాల్‌డ్రాప్స్‌తో వినియోగదారులకు నష్టం: ఏచూరి
మరిన్ని టవర్స్ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ
న్యూఢిల్లీ, డిసెంబర్ 17: పదేళ్ల యుపిఏ పాలనలో నష్టాల ఊబిలో కూరుకుపోయిన ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్‌ఎన్‌ఎల్).. తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన పదమూడు నెలల్లో మొదటిసారిగా లాభాలను ఆర్జించిందని టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. పదేళ్ల క్రితం తమ ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోతూ పది వేల కోట్ల రూపాయల లాభంతో బిఎస్‌ఎన్‌ఎల్‌ను యుపిఏ ప్రభుత్వానికి అప్పగిస్తే, యుపిఏ ప్రభుత్వం అధికారం నుంచి దిగిపొతూ ఎనిమిది వేల కోట్ల రూపాయల సష్టంతో తిరిగి తమకు అప్పగించిందని ఆయన గురువారం రాజ్యసభలో చెప్పారు. సిపిఎం సభ్యుడు బాలగోపాల్ ప్రతిపాదించిన ఒక ప్రత్యేక తీర్మానానికి జవాబుగా రవిశంకర్ ఈ విషయం చెప్పారు. కాగా, బిఎస్‌ఎన్‌ఎల్‌లో పనిచేస్తున్న కొంతమంది సంస్థ ప్రయోజనాలకు విఘాతం కలిగించే తీరులో ప్రైవేట్ యాజమాన్యాలతో కుమ్మక్కవుతున్నారని బాలగోపాల్ చేసిన ఆరోపణను ఆయన ఖండించారు. బిఎస్‌ఎన్‌ఎల్ పనితీరుపై చర్చకు తాము సిద్ధమని చెబుతూ, చర్చ జరిగితే ప్రైవేట్ యాజమాన్యాలతో ఎవరు ఎలా కుమ్మక్కయ్యారో బయట పడుతుందని ఆయన సవాల్ చేశారు. తమ సిబ్బంది నిజాయితీని శంకించవద్దని ఆయన కోరారు. సాధించవలసింది అయతే ఇంకా చాలా ఉందని ఆయన అంగీకరించారు. మరోవైపు మంత్రి ఇచ్చిన వివరణలో కొత్తేమి లేదని సిపిఎం నాయకుడు సీతారామ్ ఏచూరి విమర్శించారు. వినియోగదారునిపై అదనపు భారం మోపుతున్న కాల్‌డ్రాప్స్ గురించి మంత్రి ఏమీ చెప్పకపోవటం ఆశ్చర్యంగా ఉందని ఆయన అన్నారు. ఒక కాల్‌డ్రాప్ ఆయితే వినియోగదారులకు రూపాయి వంతున నష్టం కలుగుతోందని ఏచూరి చెప్పారు. కాల్‌డ్రాప్స్‌ను అదుపు చేయటానికి తీసుకుంటున్న చర్యలేమిటో వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. బిఎస్‌ఎన్‌ఎల్ ప్రభుత్వరంగ సంస్థ కావటం వల్ల సామాజిక బాధ్యతను నిర్వహించవలసి ఉందని మంత్రి రవిశంకర్ చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలకు గురైన ప్రాంతాల ప్రజలకు ఉచితంగా కాల్స్ చేసే అవకాశాన్ని కల్పిస్తోందని ఆయన వివరించారు. రానున్న కాలంలో మరిన్ని సెల్ టవర్స్ నిర్మించి కాల్‌డ్రాప్స్‌ను అదుపు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
రామ్‌దేవ్‌పై రగడ
ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ సంస్థలు ఉత్పత్తి చేస్తున్న ఔషధాలకు ఆరోగ్యశాఖకు అనుబంధంగా ఉన్న వివిధ శాఖల అనుమతులు లేనందున ఉత్పత్తి లైసెన్సును రద్దు చేయాలని ఆర్‌జెడి సభ్యుడు ఓపి త్యాగి రాజ్యసభలో డిమాండ్ చేశారు. యోగా ముసుగులో బాబా రామ్‌దేవ్ నియమ నిబంధనలను తుంగలో తొక్కి తన రాజ్యాన్ని విస్తరించుకుంటున్నారని ఆయన రాజ్యసభలో ప్రతిపాదించిన ప్రత్యేక తీర్మానంలో మండిపడ్డారు. పతంజలి పేరుతో రామ్‌దేవ్ సంస్థ ఉత్పత్తి చేస్తున్న ఔషధాలకు అనుమతులు లేవని ఆయన గుర్తుచేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనకు అత్యంత సన్నిహితుడని ప్రచారం చేసుకుంటూ రామ్‌దేవ్ ప్రధాని పరువు ప్రతిష్ఠలను దెబ్బతీస్తున్నారని ఆయన ఆరోపించారు.