జాతీయ వార్తలు

దయాశంకర్ నాలుక తెస్తే రూ. అరకోటి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్: తమ పార్టీ అధినేత్రి, యుపి మాజీ సిఎం మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపి బహిష్కృత నేత దయాశంకర్ సింగ్ నాలుకను కోసి తనకు ఎవరైనా ఇస్తే అక్షరాలా అరకోటి రూపాయలను నజరానాగా ఇస్తానని జన్నత్ జహాన్ అనే మహిళా నేత ఆఫర్ ప్రకటించింది. బిఎస్‌పి చండీగఢ్ విభాగం అధ్యక్షురాలిగా ఉన్న జన్నత్ గురువారం నాడు దయాశంకర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పేద ప్రజల కోసం పరితపిస్తున్న మహిళానేతను కించపరుస్తూ మాట్లాడిన దయాశంకర్‌ను వెంటనే అరెస్టు చేయాలని జన్నత్ డిమాండ్ చేశారు.