జాతీయ వార్తలు

బడ్జెట్ హల్వా పంపిణీ చేసిన ఆర్థిక మంత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఈ నెలాఖరులో పార్లమెంటులో వార్షిక బడ్జెట్ సమర్పించనున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ నార్త్‌బ్లాక్‌లో బడ్జెట్ ప్రతుల ముద్రణ ప్రారంభమైంది. ఆనవాయితీ ప్రకారం ఆర్థిక శాఖ ఉద్యోగులకు శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హల్వా పంపిణీ చేశారు. బడ్జెట్ ముందు హల్వా తయారు చేసి ఉద్యోగులకు పంచడం సంప్రదాయంగా వస్తోంది. బడ్జెట్ ప్రతుల ముద్రణలో పాల్గొనేవారు బడ్జెట్‌ను పార్లమెంటులో సమర్పించేవరకూ కార్యాలయంలోనే ఉండాలి. కొద్దిమంది ఉన్నతాధికారులను మాత్రమే ఇళ్లకు వెళ్లేందుకు అనుమతి ఇస్తారు. బడ్జెట్ ప్రతిపాదనలపై ఎలాంటి సమాచారం బయటకు పొక్కకుండా ఈ చర్యలు తీసుకుంటారు.