బిజినెస్

మారనున్న ఎంఎస్‌ఎంఇ రూపురేఖలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుల్లెట్ రైలు ప్రాజెక్టుతో 5,100 కోట్ల డాలర్ల వ్యాపారం వచ్చే అవకాశం

ముంబయి, డిసెంబర్ 24: ముంబయి-అహ్మదాబాద్‌ల మధ్య 98 వేల కోట్ల రూపాయలతో ప్రతిపాదించిన బులెట్ ట్రైన్ ప్రాజెక్టు, అలాగే దేశవ్యాప్తంగా 6 వేల కిలోమీటర్ల హైస్పీడ్ రైల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడానికుద్దేశించిన డైమండ్ చతుర్భుజి ప్రాజెక్టులతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఇ) రంగానికి 5100 కోట్ల డాలర్ల వ్యాపార అవకాశాలను సృష్టించవచ్చని ఒక నివేదిక అంచనా వేసింది. ఈ ప్రాజెక్టులకోసం సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలనుంచి 30 శాతం పరికరాల కొనుగోలును ప్రభుత్వం తప్పనిసరి చేసిన పక్షంలో అది ఈ రంగంలో 5100 కోట్ల డాలర్ల భారీ వ్యాపార అవకాశాలను సృష్టిస్తుందని దేశీయ రేటింగ్ ఏజన్సీ స్మేరా రేటింగ్స్ తన నివేదికలో అభిప్రాయ పడింది. అనుకున్న ప్రకారం ఈ ప్రాజెక్టులు గనుక అమలయితే రాబోయే పదేళ్లలో 16,800 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తారని ఆ నివేదిక పేర్కొంటూ, సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణలు లాంటి వాటి విషయంలో ఎంఎస్‌ఎంఇ రంగం ముఖచిత్రమే మారిపోవడంతో పాటుగా పెద్ద ఎత్తున పెట్టుబడుల అవకాశాలను సృష్టించడానికి ఒక మార్గం ఏర్పడుతుందని పేర్కొంది. ఈ రంగంనుంచి 30 శాతం పరికరాలను తప్పనిసరిగా కొనుగోలు చేయాలనే నిబంధనను ప్రభుత్వం తప్పనిసరి చేసిన పక్షంలో ఈ మెగా ప్రాజెక్టులనుంచి స్పెషల్ పర్పస్ మిషనరీలు, ఫాబ్రికేటెడ్ మెటల్స్, ప్రిండింగ్ తదితర రంగాల్లో ఈ రంగలోని 28 శాతం పరిశ్రమలు లబ్ధి పొందుతాయని ఆ నివేదిక పేర్కొంది. అదే గనుక జరిగితే ఈ రంగానికి దాదాపు 5100 కోట్లమేరు లబ్ధి చేకూరుతుందని తెలిపింది. ముంబయి-అహ్మదాబాద్ బులెట్ ట్రైన్ లాభదాయకతపై పలువురు విశే్లషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ ఈ నివేదికమాత్రం 1600 డాలర్ల తలసరి ఆదాయం ఉన్న మన దేశం పరిస్థితి జపాన్‌కన్నా మెరుగైన స్థితిలో ఉందని అభిప్రాయ పడింది. 1994లో జపాన్ టోక్యో-ఒసాకా నగరాల మధ్య తన తొలి బులెట్ ట్రైన్‌ను ప్రవేశపెట్టినప్పుడు దాని తలసరి ఆదాయం 1346 డాలర్లు మాత్రమే ఉండింది. జపాన్ ఈ ప్రాజెక్టుకు 30 ఏళ్ల కాలపరిమితితో ఒకశాతం వడ్డీపై 1200 కోట్ల డాలర్ల రుణం ఇవ్వడానికి అంగీకరించడం తెలిసిందే.