హైదరాబాద్

విలీనం దిశగా...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రేటర్‌ఆస్తిపన్నులో
జలమండలి వాటా
తాజాగా జీవో జారీ చేసిన సర్కారు
ఇప్పటికే ఆర్టీసికి
చెల్లిస్తుంది రూ. 250 కోట్లు
అదనంగా జలమండలికి రూ. 225 కోట్లు
చెల్లించాల్సిందే
జిహెచ్‌ఎంసిపై పెరుగుతున్న ఆర్థిక భారం
హైదరాబాద్, నవంబర్ 20: జంటనగర వాసులకు అతి ముఖ్యమైన, అత్యవసరమైన సేవలందించే విషయంలో పెద్దన్న పాత్ర పోషించే మహానగర పాలక సంస్థకు మున్ముందు మరిన్ని బాధ్యతలు, బరువులు పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. మహానగర ప్రజలకు తాగునీటిని అందించే జలమండలి, ప్రతిరోజు లక్షలాది మందిని తమతమ గమ్యస్థానాలను చేర్చే ఆర్టీసి విభాగాలను ఒకే గొడుగు కిందకు తేవాలన్న డిమాండ్ ఏ నాటి నుంచో ఉన్నా, తాజాగా కెసిఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల నేపథ్యంలో జలమండలి, ఆర్టీసిలను గ్రేటర్‌లో విలీనం చేసే దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పవచ్చు. నగరంలోని సుమారు 21లక్షల గృహాల నుంచి ఆస్తిపన్ను, మరో లక్ష వ్యాపార సంస్థల నుంచి ట్రేడ్ లైసెన్సులు, అలాగే ఆస్తిపన్ను తర్వాత అతి పెద్ద ఆదాయ వనరైన టౌన్‌ప్లానింగ్ విభాగం ద్వారా భవన నిర్మాణ అనుమతులు జారీ చేస్తూ కోట్లాది రూపాయలను వసూలు చేసుకుంటున్న మహానగర పాలక సంస్థ పరిధిలోకి ఈ రెండు విభాగాలను తేవాలన్న ఆలోచన దశల వారీగా అమలవుతుందని చెప్పవచ్చు. కొద్దిరోజుల జిహెచ్‌ఎంసి గ్రేటర్‌లో వసూలు చేసుకునే ఆస్తిపన్నులో రూ. 250 కోట్లు ఆర్టీసికి నిర్వహణ వ్యయంగా చెల్లించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే! అంతేగాక, తొలి దశగా ఆపరేషన్స్, మెయింటనెన్స్ కోసం సర్కారు జీవో జారీ చేయటంతో రూ. 150 తక్షణ ఆర్థిక సహాయంగా జిహెచ్‌ఎంసి ఆర్టీసికి చెల్లించింది. అంతేగాక, ఆర్టీసి పాలక మండలిలో గ్రేటర్ కమిషనర్‌కూ సభ్యత్వం కల్పించటంతో విలీనం దిశగా ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయనే చెప్పవచ్చు.
అయితే అదే ఆస్తిపన్నులో మరో 25శాతం జలమండలికి చెల్లించాల్సి ఉంది. ఈ విషయం మహానగర మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలో సైతం స్పష్టంగా ఉందని అధికారులు సైతం చెబుతున్నారు.
అయితే ఇప్పటి వరకు పలు సార్లు అడపాదడపా చెల్లిస్తూ వచ్చిన జిహెచ్‌ఎంసి, జలమండలిల మధ్య ఆస్తిపన్ను బకాయిల సర్దుబాటు వంటి అంశాలు తెరపైకొచ్చి ఈ రెండు విభాగాల మధ్య దూరం కూడా పెరిగింది. కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి కెసిఆర్ వద్ధ జరిగిన పలు సమీక్షల్లో ఏకంగా 25 శాతం చెల్లిస్తే కార్పొరేషన్ ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొవల్సి వస్తోందని అధికారులు వివరించటంతో వసూలయ్యే మొత్తం ఆస్తిపన్నులో కనీసం 15శాతమైనా చెల్లించాల్సిందేనంటూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం జీవో 168ను జారీ చేసింది. దీనికి తోడు లైబ్రెరరీలకు సెజ్‌గా మరో 8శాతం ఆస్తిపన్నును జిహెచ్‌ఎంసి చెల్లిస్తూ వస్తోంది.
ఈ ఏటా చెల్లింపులు రూ. 659 కోట్ల పై మాటే
వర్తమాన ఆర్థిక సంవత్సరం 2015-16 చివర్లో టార్గెట్‌గా పెట్టుకున్న సుమారు రూ. 1500 ఆస్తిపన్నులో 15శాతం అంటే రూ. 225 కోట్లు జలమండలికి, ఇదివరకే జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఆర్టీసికి రూ. 250 కోట్లు, అలాగే రూ. 84 నుంచి రూ. 85 వరకు సెజ్ కింద గ్రంథాలయాల శాఖకు జిహెచ్‌ఎంసి చెల్లించాల్సి ఉంది.
ప్రజలపై ఎలాంటి ఆర్థిక భారం పడుకుండా ఎప్పటికపుడు ఆర్థిక వనరులను పెంచుకుంటే తప్పా, మున్ముందు పొంచి ఉన్న ఆర్థిక సంక్షోభం నుంచి గ్రేటర్ గట్టెక్కే అవకాశాల్లేవని కొందరు అధికారులే బహాటంగా చెబుతున్నారు.