బిజినెస్

కొనుగోళ్ల జోష్‌లో మదుపరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 26: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో వారం లాభాలను అందుకున్నాయి. గడచిన వారం కేవలం మూడు రోజులే ట్రేడింగ్ జరిగినది తెలిసిందే. హోలి, గుడ్‌ఫ్రైడే సందర్భంగా గురు, శుక్రవారాలు మార్కెట్లు మూతపడ్డాయి. అయితే అంతకుముందు సోమ, మంగళ, బుధవారాల్లో మార్కెట్ కార్యకలాపాలు సాగగా, బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 25వేల స్థాయి ఎగువన ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 7,700 స్థాయిని అధిగమించింది. మూడు రోజుల్లో సెనె్సక్స్ 384.82 పాయింట్లు పుంజుకుని 25,337.56 వద్ద ముగియగా, నిఫ్టీ 112.15 పాయింట్లు అందిపుచ్చుకుని 7,716.50 వద్ద నిలిచింది. బ్రసెల్స్ ఉగ్రవాద దాడుల మధ్య కూడా మదుపరులు పెట్టుబడులకు ఆసక్తి కనబరచగా, వచ్చే నెల 5న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) జరిపే ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేట్లైన రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లు తగ్గుతాయన్న అంచనాలే ఇందుకు కారణం. రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, ఆటో, మెటల్, కన్జ్యూమర్ డ్యూరబుల్, విద్యుత్, బ్యాంకింగ్, టెక్నాలజీ, పిఎస్‌యు, హెల్త్‌కేర్, ఐటి, ఎఫ్‌ఎమ్‌సిజి, చమురు, గ్యాస్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇక వరుసగా నాలుగు వారా ల్లో సెనె్సక్స్ 2,183.26 పాయింట్లు ఎగబాకితే, నిఫ్టీ ఈ నాలుగు వారాల్లోనే 686.75 పాయింట్లు ఎగిసింది. గడచిన వారం విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ) 3,587.29 కోట్ల రూపాయల పెట్టుబడులను మార్కెట్లలోకి తెచ్చినట్లు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ తెలిపింది. ఇక టర్నోవర్ విషయానికొస్తే గడచిన వారం బిఎస్‌ఇ 9,153.54 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ 49,672.25 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు వారం బిఎస్‌ఇ టర్నోవర్ 14,255.83 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ టర్నోవర్ 80,247 కోట్ల రూపాయలుగా ఉంది.

‘పునరుత్పాదక శక్తికి భారత్, చైనా పెద్దపీట’
ఐక్యరాజ్యసమితి, మార్చి 26: గత ఏడాది భారత్, చైనా నేతృత్వంలో అభివృద్ధి చెందిన దేశాలు పునరుత్పాదక శక్తిపై పెట్టుబడులు పెట్టాయని ఐక్యరాజ్యసమితి తెలిపింది. సౌర, పవన తదితర పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యంపై దృష్టి పెట్టిన అభివృద్ధి చెందుతున్న దేశాలు.. సంపన్న దేశాలను అధిగమించే దిశగా పయనిస్తున్నాయంది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని పర్యావరణ కార్యక్రమం రూపొందించిన ‘రెన్యువబుల్ ఎనర్జీ ఇనె్వస్ట్‌మెంట్ 2016లో గ్లోబల్ ట్రెండ్స్’ నివేదికలో పునరుత్పాదక శక్తిపట్ల ఉన్న చిత్తశుద్ధికి భారత్, చైనాలకు ప్రశంసలు దక్కాయి.