బిజినెస్

స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 20: దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల మధ్య మదుపరులు, రిటైలర్లు పెట్టుబడులపట్ల కాస్త ఆసక్తి కనబరిచారు. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు పడుతూ, లేస్తూ సాగిన పయనంలో చివరకు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 26.57 పాయింట్లు పెరిగి 25,868.49 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 13.80 పాయింట్లు లాభపడి 7,856.55 వద్ద నిలిచింది. గురువారం సెనె్సక్స్ 360, నిఫ్టీ 110 పాయింట్లు లాభపడినది తెలిసిందే. ఇకపోతే శుక్రవారం ట్రేడింగ్‌లో చమురు, గ్యాస్, క్యాపిటల్ గూడ్స్, ఐటి, టెక్నాలజీ, ఆటో రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ముఖ్యంగా గ్యాస్ పంపిణీ సంస్థల షేర్లు భారీ లాభాలను ఆర్జించాయి. ప్రభుత్వరంగ సంస్థలైన గెయిల్ షేర్ల విలువ అత్యధింకగా 10.07 శాతం పుంజుకుంటే, పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జి 6.79 శాతం, గుజరాత్ గ్యాస్ 6.03 శాతం, ఇంద్రప్రస్థ గ్యాస్ 3.85 శాతం చొప్పున షేర్ల విలువను పెంచుకున్నాయి.
వేదాంత, హిందాల్కో బయటకు
మెటల్, మైనింగ్ దిగ్గజం వేదాంత, ఆదిత్యా బిర్లా గ్రూప్ సంస్థ హిందాల్కో ఇండస్ట్రీస్ డిసెంబర్ 21 నుంచి సెనె్సక్స్‌లో నుంచి తప్పుకోనున్నాయి. వీటి స్థానంలో అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఎపిసెజ్), ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్ రానున్నాయి. అలాగే ఎన్‌హెచ్‌పిసి, జైప్రకాశ్ అసోసియేట్స్, యునిటెక్ కూడా సెనె్సక్స్ నుంచి వైదొలగుతున్నాయి.
ప్రభుత్వ బాండ్ల వేలం
న్యూఢిల్లీ: విదేశీ మదుపరులకు ప్రభుత్వ బాండ్లను సోమవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ వేలం వేయనుంది. సాధారణ మార్కెట్ ట్రేడింగ్ కార్యకలాపాలు ముగిసిన అనంతరం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండు గంటలపాటు ఈ వేలం జరుగుతుంది. ఈ సందర్భంగా 332 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ రుణ సెక్యూరిటీలను బిఎస్‌ఇ వేలం వేస్తోంది. ప్రభుత్వ రుణ సెక్యూరిటీల్లో 1,29,900 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ మదుపరులకు పరిమితి ఉంది. అయితే గత నెల అక్టోబర్ 29 వరకు ఇది 1,29,048 కోట్ల రూపాయలుగా ఉంది. సోమవారం వేలంతో ఇది మరింత పెరగనుంది.