బిజినెస్

పెట్టుబడుల ఉపసంహరణకు ప్రభుత్వం రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడులను ఉపసంహరించి దాదాపు 40 వేల కోట్ల రూపాయలను రాబట్టుకునేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓఎన్‌జిసి, ఆయిల్ ఇండియా, కోలిండియా సహా 16 పిఎస్‌యులతో జాబితాను సిద్ధం చేసుకుంది. ఈ జాబితాలో ఎన్‌ఎండిసి, ఎంఓఐఎల్, ఎంఎంటిసి, నేషనల్ ఫెర్టిలైజర్స్, ఎన్‌హెచ్‌పిసి, నాల్కో, భారత్ ఎలక్ట్రానిక్స్ తదితర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. వీటి నుంచి పెట్టుబడులు ఉపసంహరించడం ద్వారా ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ప్రభుత్వానికి దాదాపు 40 వేల కోట్ల రూపాయల నిధులు సమకూరుతాయి. వాస్తవానికి ఈ జాబితాలోని చాలా పిఎస్‌యుల నుంచి ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలోనే పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని భావించింది. అయితే కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడులను ఉపసంహరించేందుకు మంత్రి వర్గం అనుమతి తెలపాల్సి ఉండటం, అలాగే గతేడాది మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు ఏర్పడటంతో ఈ ప్రక్రియ ఆలస్యమైంది. అయితే ప్రస్తుతం పైన పేర్కొన్న ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను విక్రయించేందుకు మంత్రివర్గం నుంచి అనుమతి లభించిందని, అలాగే అధిక నిధులున్న పిఎస్‌యుల వాటాలను తిరిగి కొనుగోలు చేసే అవకాశాన్ని కూడా ఆర్థిక శాఖ పరిశీలిస్తోందని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.
కోలిండియా, ఎన్‌ఎండిసి, నాల్కో నుంచి 10 శాతం వాటాలను ఉపసంహరించుకుంటే ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ప్రభుత్వానికి వరుసగా రూ.18 వేల కోట్లు, రూ.3,800 కోట్లు, రూ.1000 కోట్ల చొప్పున సమకూరుతాయి. అలాగే ఓఎన్‌జిసి, బిహెచ్‌ఇఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్ సంస్థల నుంచి 5 శాతం వాటాలను విక్రయించడం ద్వారా ప్రభుత్వం వరుసగా రూ.9 వేల కోట్లు, రూ.1,300 కోట్లు, రూ.1,400 కోట్ల చొప్పున రాబట్టుకోగలుగుతుంది. 10 శాతం వాటాలను అమ్మడం ద్వారా ఎన్‌హెచ్‌పిసి నుంచి రూ.3 వేల కోట్లు, మొయిల్ నుంచి రూ.365 కోట్లు, 15 శాతం పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఎంఎంటిసి నుంచి రూ.560 కోట్లు, నేషనల్ ఫెర్టిలైజర్స్ నుంచి రూ.200 కోట్లు, ఎస్‌టిసి నుంచి రూ.80 కోట్లు ఒనగూడుతాయి. వీటితో పాటు రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి 5 శాతం, ఐటిడిసి నుంచి 12.3 శాతం వాటాలను అమ్మాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 56,500 కోట్ల రూపాయలను రాబట్టుకోవాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్‌లో స్పష్టం చేసిన విషయం విదితమే. వీటిలో రూ.36 వేల కోట్లు ప్రభుత్వ రంగం సంస్థల్లో స్వల్పంగా వాటాలను అమ్మడం ద్వారా వస్తాయని, మిగిలిన రూ.20,500 కోట్లు లాభ, నష్టాల్లో పయనిస్తున్న సంస్థల నుంచి వ్యూహాత్మక వాటాల అమ్మకం ద్వారా వస్తాయని అంచనా వేస్తున్నారు.