బిజినెస్

స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల ద్వారా ఎల్‌ఐసికి రూ.11 వేల కోట్ల లాభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 7: జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసి) ఇటీవల ముగిసిన 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీల్లో పెట్టుబడుల ద్వారా 11 వేల కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించినట్లు ఆ సంస్థ ఉన్నతాధికారి ఒకరు గురువారం చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలోకొన్ని లాభాల స్వీకరణ అవకాశాలు లభించాయని, ఫలితంగా ఇటీవల ముగిసిన 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీల్లో పెట్టుబడుల ద్వారా రూ 11 వేల కోట్లు ఆర్జించామని ఎల్‌ఐసి పెట్టుబడుల కార్యకలాపాల విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రవీణ్ కుటుంబె ఇక్కడొక కార్యక్రమం నేపథ్యంలో విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం ఎల్‌ఐసి ఈక్విటీ, డెట్ మార్కెట్లలో 2.70 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టిందని, ఇందులో రూ 65 వేల కోట్లు ఈక్విటీ విభాగంలో పెట్టుబడి పెట్టిందని ఆయన చెప్పారు. ఏడాది చివరి భాగంలో మార్కెట్లు ఒత్తిళ్లకు లోనయిన నేపథ్యంలో ఎల్‌ఐసి ఇంతకు ముందు ప్రకటించిన తన ఈక్విటీ పెట్టుబడుల లక్ష్యమైన 60 వేల కోట్లను మించి పెట్టుబడులు పెట్టినట్లు ఆయన చెప్పారు. క్లిష్ట సమయంలో కూడా 52 వారాల గరిష్ఠ స్థాయికి చేరుకున్న స్టాక్స్ కొన్ని ఉన్నాయని, అలాంటి పెట్టుబడులనుంచి వైదొలగడం ద్వారా ఎల్‌ఐసి లాభాలు సంపాదించిందని ఆయన చెప్పారు.
ఇదిలావుంటే,జపాన్‌కు చెందిన ఫైనాన్షియల్ సర్వీసుల దిగ్గజం నోమురా ఎల్‌ఐసితో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న మ్యూచువల్ ఫండ్ వ్యాపారంలో ఆ సంస్థకున్న 35 శాతం వాటాను అమ్మడానికి కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలియజేసింది. ఎల్‌ఐసి నోమురా మ్యూచువల్ ఫండ్ ఎఎంసి, ఎల్‌ఐసి నోమురా మ్యూచువల్ ఫండ్ ట్రస్టీ కంపెనీలో ఉన్న 35 శాతం వాటాను నోమురా అసెట్ మేనేజిమెంట్ స్ట్రాటజిక్ ఇనె్వస్ట్‌మెంట్ విక్రయిస్తుంది.ఈ వాటాలను జిఐసి హౌసింగ్ ఫైనాన్స్, కార్పొరేషన్ బ్యాంక్, ఎల్‌ఐసి హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు కొనుగోలు చేయనున్నాయి. ఈ లావాదేవీని సిసిఐ ఆమోదించినట్లు ఆ సంస్థ వెబ్‌సైట్‌లో ఉంచిన తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.