బిజినెస్

మిర్చి రైతుదిగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కురిచేడు, ఏప్రిల్ 7: ఖరీదైన విత్తనం.. భారీ సేద్యం.. లోపం ఎక్కడ ఉందోకానీ దిగుబడిపై పెను ప్రభావం చూపింది. ఎకరాకు 40 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సిన మిర్చి రెండు క్వింటాళ్లకు పడిపోయింది. దీంతో రైతులు భారీగా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలో నాణ్యత లోపించిన మిర్చి విత్తనాలతో సుమారు 400 ఎకరాల్లో సాగుచేసిన రైతులు దిగుబడి రాక సుమారు 20కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయారు. ఓ ప్రముఖ కంపెనీకి చెందిన విత్తనాన్ని కిలో 18వేల నుంచి 21వేల రూపాయలు వెచ్చించి రైతులు కొనుగోలు చేశారు. కురిచేడుకు చెందిన ఒక విత్తన విక్రయదారుడు పొదిలిలోని పంపిణీదారుడి నుంచి విత్తనాలు తెప్పించి మిర్చినారు సాగుచేసే రైతులకు విక్రయించారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన పదిమంది రైతులు నారుమడులు పెంచారు. వారి నుంచి మరో 50మంది రైతులు నారు కొనుగోలుచేసి మండల వ్యాప్తంగా సుమారు 400 ఎకరాల్లో మిర్చిపంట సాగుచేశారు. గత ఏడాది మిర్చిపంట సాగుచేసిన రైతులు ఆర్థికంగా బలపడటంతో ఈఏడాది సాగు విస్తీర్ణాన్ని పెంచారు. దీనికి తగినట్లుగానే ఖర్చుకు వెనుకాడకుండా వేలాది రూపాయలు పెట్టుబడులకు వెచ్చించారు. నారు నాటిన దగ్గర నుంచి మొక్కల ఎదుగుదల ఒకతీరుగా లేదు. దానికి తగ్గట్లుగానే కాసిన కాయలు పొట్టి, పొడుగు, ముడత రూపాలను పోలి ఉండటంతో రైతులు కంగుతిన్నారు. ఒక పంటపొలంలో అయితే ఏదో నేలతీరు అని సరిపెట్టుకోవచ్చు. కానీ ప్రముఖ కంపెనీ విత్తనాలతో సాగుచేసిన పొలాల దిగుబడి అంతా అలాగే ఉండడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. అప్పటికీ రైతులు ఎకరాకు 2లక్షల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారు. దిగుబడి అధ్వాన్నంగా ఉండడంతో విత్తన విక్రయదారుడి దృష్టికి తీసుకుపోయారు. ఆయన పంపిణీదారుడితో, విత్తన ఉత్పత్తిదారులతో చర్చలు జరిపారు.కానీ రైతులకు ఒరిగిందేమీలేదు. దీంతో రైతులు ఫిబ్రవరి 17న జిల్లా వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో గుంటూరుకు చెందిన వ్యవసాయ శాస్తవ్రేత్త, దర్శి ఎడిఎ, ఇతర వ్యవసాయ అధికారులు పంట పొలాలను పరిశీలించారు. అప్పటికే చాలామంది రైతులు దిగుబడిలేని పంటను దున్నివేశారు. వ్యవసాయ అధికారుల పరిశీలనలో తమకు ఎలాంటి ప్రయోజనం కలిగేలా లేదని బాధిత రైతులు షేక్ బాజీ తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యత లోపమో, లేక నకిలీ విత్తనమో కానీ తమ పాలిట శాపంగా మారిందని రైతులు వాపోతున్నారు. మిర్చి క్వింటా ధర 12వేల నుంచి 15వేల రూపాయలు పలుకుతోంది. తాము చేసిన సాగు అనుకూలించి ఉంటే ఎకరాకు 40 క్వింటాళ్లు దిగుబడి వచ్చి సుమారు 5లక్షల రూపాయల ఆదాయం వచ్చేది. ఆవిధంగా 400 ఎకరాలకు సుమారు 20కోట్ల రూపాయల మేరకు దిగుబడి వచ్చి ఉండేదని రైతులు లెక్కలు వేస్తున్నారు. ఆరుగాలం తాము పడిన శ్రమంతా వృథా కావడమేకాక ఎకరాకు 2లక్షల రూపాయలు పెట్టుబడుల రూపేణా నష్టపోయామని రైతులు విలపిస్తున్నారు.