బిజినెస్

ఎఫ్‌సిఎన్‌ఆర్(బి) డిపాజిట్లపై వడ్డీ పెంచిన ఇండియన్ బ్యాంకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 8: దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన ఇండియన్ బ్యాంకు తమ ఫారిన్ కరెన్సీ నాన్-రెసిడెంట్ (బ్యాంకింగ్) (ఎఫ్‌సిఎన్‌ఆర్-బి) టర్మ్ డిపాజిట్లకు సంబంధించిన వడ్డీ రేట్లను సవరించింది. ఏడాది నుంచి రెండేళ్లలోపు కాలపరిమితితో అమెరికన్ డాలర్లలో చేసిన ఎఫ్‌సిఎన్‌ఆర్(బి) డిపాజిట్లపై ప్రస్తుతం 2.02 శాతంగా ఉన్న వడ్డీరేటును 2.11 శాతానికి, రెండేళ్ల నుంచి మూడేళ్లలోపు కాలపరిమితి కలిగివున్న డిపాజిట్లపై వడ్డీ రేటును 2.12 శాతం నుంచి 2.32 శాతానికి పెంచినట్లు ఇండియన్ బ్యాంకు పేర్కొంది. అలాగే మూడు నుంచి నాలుగేళ్లలోపు కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీరేటును 2.70 శాతం నుంచి 3.01 శాతానికి, నాలుగు నుంచి ఐదేళ్లలోపు డిపాజిట్లపై వడ్డీరేటును 2.77 శాతం నుంచి 3.16 శాతానికి, ఐదేళ్ల వరకు కాలపరిమితి కలిగివున్న డిపాజిట్లపై వడ్డీ రేటును 2.86 శాతం నుంచి 3.29 శాతానికి పెంచామని ఇండియన్ బ్యాంకు వివరించింది. సవరించిన వడ్డీరేట్లన్నీ తక్షణమే అమలులోకి వస్తాయని ఆ బ్యాంకు స్పష్టం చేసింది.