బిజినెస్

మార్కెట్లకు కళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 8: గురువారం జరిగే ఐరోపా సెట్రల్ బ్యాంక్ ద్రవ్య సమీక్షలో ఉద్దీపక చర్యలను కొనసాగించవచ్చన్న అంచనాలకు తోడు, పెద్ద నోట్ల రద్దు అనంతరం ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి చర్యలు తీసుకుంటామని ఆర్‌బిఐ హామీలు ఇచ్చిన నేపథ్యంలో దేశీయ మార్కెట్లు గురువారం భారీ లాభాలు ఆర్జించాయి. బిఎస్‌ఇ సెనె్సక్స్ ఏకంగా 457 పాయింట్లు లాభపడి 26,694 పాయింట్లకు చేరుకోగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 8,200 పాయింట్ల స్థాయిని దాటిపోయింది. ఐరోపా మార్కెట్లు ప్రారంభంనుంచే లాభాల్లో సాగడాన్ని స్ఫూర్తిగా తీసుకున్న ఇనె్వస్టర్లు పెద్ద ఎత్తున కొనుగోళ్లకు దిగడంతో సూచీలు ప్రారంభంనుంచే భారీ లాభాల్లో సాగాయి. దాదాపు రోజంతా లాభాల్లోనే సాగిన సెనె్సక్స్ ఒక దశలో 26,733.87 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకింది. చివరికి 457.41 పాయింట్ల లాభంతో 26,694.28 పాయింట్ల వద్ద ముగిసింది. నవంబర్ 11 తర్వాత సెనె్సక్స్ ఒక్క రోజే ఇంత భారీగా పెరగడం ఇదే మొదటిసారి. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ 144.80 పాయింట్లు పెరిగి 8,246.85 పాయింట్ల వద్ద ముగిసింది. సిఆర్‌ఆర్‌పై ఆర్‌బిఐ నిర్ణయం తర్వాత ప్రధాన బ్యాంకులయిన ఎస్‌బిఐ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు 1.72 శాతందాకా పెరిగాయి. కాగా, టాటా స్టీల్ షేరు అన్నిటికన్నా అధికంగా 4.62 శాతం పెరగ్గా, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్ హీరోమోటోకార్ప్, బజాజ్ ఆటో, ఐటిసిలాంటి కంపెనీల షేర్లు కూడా మంచి లాభాలు పొందాయి. ఒక్క ఎన్‌టిపిసి తప్ప సెనె్సక్స్‌లోని అన్ని కంపెనీల షేర్లు లాభాల్లో ముగిశాయి. కాగా, ప్రధాన ఆసియా సూచీలన్నీ లాభాల్లో ముగియగా, ఐరోపా మార్కెట్లు సైతం ప్రారంభంలోనే లాభాలతో మొదలైనాయి.
ఇదిలా ఉండగా, ఫార్మాస్యూటికల్ సంస్థ లారస్ ల్యాబ్స్ ఐపిఓ గురువారం బిడ్డింగ్ చివరి రోజున పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయింది. గురువారం మధ్యాహ్నానికల్లా 2,19,11,308 షేర్లకు గాను 2,26,84,270 షేర్లకు బిడ్స్ వచ్చాయి.