బిజినెస్

చిన్న మదుపరులకు చక్కని అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: ప్రొఫెషనల్ మేనేజ్‌మెంట్, డైవర్సిఫికేషన్, టాక్స్ ఎఫిషియన్సి, కన్వీనియన్స్ తదితర సేవలతో కూడుకున్న మ్యూచువల్ ఫండ్స్ చిన్న పెట్టుబడిదారులకు ఎంతో మంచి పెట్టుబడులని ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్స్ ఎండి, సిఇఒ నిమేశ్ షా తెలిపారు. షా ఆదివారం ఒక ప్రకటనలో ఈ విషయం చెప్పారు. చిన్న పెట్టుబడిదారుల నుండి మ్యూచువల్ ఫండ్ రూపంలో సేకరించిన డబ్బును ఒక చోటికి చేర్చి మంచి వడ్డీ లభించే వివిధ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టడంతోపాటు కాలానుసారం దానిని ఒక సంస్థ నుండి మరో సంస్థకు మారుస్తూ పెట్టుబడులు పెరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు.
ఫండ్ మేనేజర్ ఈ నిధిని నిర్వహిస్తూ దీనిని పెంచేందుకు ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటారని ఆయన చెప్పారు. ప్రొఫెషనల్ మేనేజర్లు మార్కెట్ పరిస్థితుల ఆధారంగా తగు నిర్ణయాలు తీసుకుంటూ నిధిని నిర్వహిస్తారు కాబట్టి పెట్టుబడిదారులకు రోజువారీ విశే్లషణ, నిర్వహణ తప్పుతుందని షా పేర్కొన్నారు. ఏ వాటాలు ఎప్పుడు కొనాలి, ఈ వాటాలను ఎప్పుడు అమ్మాలి, ఎంత సమయం వేచి ఉండాలని ఆలోచించవలసిన అవసరం వ్యక్తిగత పెట్టుబడిదారులకు ఉండదన్నారు.
‘గత రెండు, మూడు నెలల నుండి పెట్టుబడుల మార్కెట్‌లో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి, అయితే మార్పులు, చేర్పులు ఎంతో ఆరోగ్యకరమైనవి.’ అని షా అభిప్రాయపడ్డారు. దీనివలన లాభాలకు సంబంధించిన పెట్టుబడిదారుల అంచనాల్లో మార్పు వస్తుందన్నారు.
కరెంట్ ఖాతా లోటు తగ్గుముఖం పట్టడం, ద్రవ్యోల్బణం అదుపులో ఉండడం, వడ్డీరేట్లు తగ్గిన నేపథ్యంలో నిధులను సరైన పద్ధతిలో ఉపసంహరించుకోవడం ద్వారా ఆస్తుల నిర్మాణం జరగాల్సిన అవసరం ఉందన్నారు. స్వల్పకాల మార్పులను ఉపయోగించుకోవడం ద్వారా దీర్ఘకాల ఆస్తులను నిర్మించటం జరుగుతుందని నిమేశ్ షా చెప్పారు.

నేపాల్‌లో డాబర్ జ్యూస్ సీజ్
కట్మండు, డిసెంబర్ 13: డాబర్ ఇండియా అనుబంధ సంస్థ డాబర్ నేపాల్ తయారు చేసిన రియల్ జూస్‌తో కూడిన 77 కంటైనర్లను నేపాల్ అధికారులు ఆదివారం భారత సరిహద్దుల్లో సీజ్ చేశారు. వీటి నాణ్యతపై అందిన ఫిర్యాదుల నేపథ్యంలో కమిషన్ ఫర్ ది అబ్యూజ్ ఆఫ్ అథారిటీ (సిఐఎఎ) ఈ చర్యకు దిగింది. బిర్గుంజ్‌లో సిర్సియా డ్రై పోర్టు వద్ద భారత్‌కు ఈ జ్యూస్ ఎగుమతి అవుతుండగా, సిఐఎఎ స్వాధీనం చేసుకుంది. ఎక్ప్‌పైరీ డేట్ తీరిన ఉత్పత్తులను విక్రయస్తున్నారన్న ఫిర్యాదులతో డాబర్ గోడౌన్‌లపైనా సోదాలు జరిగాయ.