బిజినెస్

అమెరికా సంపన్న పారిశ్రామికవేత్తల్లో ఇద్దరు యువ ప్రవాస భారతీయులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికాలోని పారిశ్రామికవేత్తల్లో 40 సంవత్సరాల్లోపు వయసున్నవారితో ఫోర్బ్స్ మ్యాగజైన్ ఈ ఏడాదికిగాను రూపొందించిన రెండో వార్షిక జాబితాలో ఇద్దరు యువ ప్రవాస భారతీయులకు చోటు దక్కింది. 31 ఏళ్ల బయోటెక్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి 600 మిలియన్ డాలర్ల సంపదతో 24వ స్థానాన్ని సాధించగా, 30 ఏళ్ల ఇన్‌స్టాకార్ట్ సహవ్యవస్థాపకుడైన అపూర్వ మెహతా 360 మిలియన్ డాలర్లతో 31వ స్థానంలో నిలిచారు. ఇక ఈ జాబితాలో ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్‌బర్గ్ 50 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉన్నారు. 40 మందితో తయారైన ఈ జాబితాల్లో ఇద్దరు మహిళలూ ఉండగా, చివరి రెండు స్థానాల్లో వారున్నారు.

చిత్రాలు..వివేక్ రామస్వామి, అపూర్వ మెహతా