బిజినెస్

తగ్గిన విదేశీ మారకద్రవ్య నిల్వలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 16: దేశంలో విదేశీ మారకద్రవ్య నిల్వలు వరుసగా మరోసారి తగ్గాయి. ఈ నెల 9వ తేదీతో ముగిసిన వారంలో ఈ నిల్వలు 887.2 మిలియన్ డాలర్లు తగ్గి 362.987 బిలియన్ డాలర్లకు పతనమయ్యాయని, విదేశ కరెన్సీ ఆస్తులు తగ్గడమే ఇందుకు కారణమని రిజర్వు బ్యాంకు శుక్రవారం వెల్లడించింది. అంతకుముందు వారంలో విదేశీ మారకద్రవ్య నిల్వలు 1.431 బిలియన్ డాలర్లు తగ్గి 363.874 బిలియన్ డాలర్లకు క్షీణించాయి. దేశంలో గత ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ నాటికి గతంలో ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయిలో 371.99 బిలియన్ డాలర్లకు చేరుకున్న విదేశీ మారకద్రవ్య నిల్వలు ఇప్పుడు క్రమేణా తగ్గుతుండటం గమనార్హం.