బిజినెస్

స్మార్ట్ ఫోన్లకు భలే డిమాండ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, డిసెంబర్ 25: స్మార్ట్ ఫోన్లకు అనూహ్యమైన డిమాండ్ ఏర్పడింది. నిన్నమొన్నటి వరకు సాధారణ మొబైల్ ఫోన్లను మాత్రమే వినియోగించినవారు సైతం ఇప్పుడు స్మార్ట్ఫోన్లకు అలవాటుపడుతున్నారు. పాత పెద్ద నోట్ల రద్దు అనంతర పరిణామాలే దీనికి కారణం. గత నెల రోజుల్లో స్మార్ట్ఫోన్ల విక్రయాలు గణనీయంగా పెరిగినట్టు సంబంధిత వ్యాపార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే అదనుగా ఆయా ఈ-కామర్స్ సంస్థలూ స్మార్ట్ఫోన్ల అమ్మకాలపై ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. వినియోగదారుల్లో అధిక శాతం ఆన్‌లైన్‌లోనే స్మార్ట్ఫోన్లను బుక్ చేసుకునేందుకు ఆసక్తి చూపుతుండటంతో దీన్ని క్యాష్ చేసుకుంటున్నాయ ఈ-కామర్స్ దిగ్గజాలు. కేంద్ర ప్రభుత్వం గత నెల 8వ తేదీ రాత్రి 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేసినది తెలిసిందే. దీంతో నగదు రహిత లావాదేవీలను కేంద్రం ప్రాచుర్యం లోకి తీసుకొస్తుండగా, వీటిని ప్రోత్సహించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలను ప్రభుత్వం జారీ చేసింది. తూర్పు గోదావరి జిల్లాలో జనవరి మొదటి వారం నుండి నగదు రహిత అమ్మకాలను పూర్తిస్థాయిలో జరిపేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ ప్రక్రియ ఎంతవరకు విజయవంతమవుతుందన్న అంశాన్ని పక్కన పెడితే వినియోగదారులను సాంకేతికత వైపు నడిపించేందుకు మాత్రం అధికారులు వివిధ మార్గాలను ఎంచుకున్నారు. జిల్లాలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ఫోన్లు వినియోగిం చాలని ప్రభుత్వ యంత్రాంగం పిలుపునిచ్చింది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల నుండి దినసరి కూలీల వరకు, పాన్ షాపుల నుండి వర్తకుల వరకు విధిగా స్మార్ట్ఫోన్లు కలిగి ఉండాలని కోరుతున్నారు. రైతులు, మహిళా సంఘాలు, పింఛనుదార్లు, చేతివృత్తుల వారు ఇలా అన్ని వర్గాల వారు ఆన్‌లైన్ ద్వారానే నగదు బదిలీ చేసుకోవాలని, ఇందుకు అవసరమైన స్మార్ట్ఫోన్లను ఉంచుకోవాలని పదే పదే ప్రకటనలు చేస్తున్నారు.
కాగా, పెద్దనోట్ల రద్దుకు ముందు వరకు నగదు రహిత లావాదేవీలపై ప్రభుత్వం ఏ విధమైన దృష్టి సారించలేదు. దీంతో నగదు లావాదేవీలు 98 శాతం, మిగిలిన 2 శాతం నగదు రహిత లావాదేవీలు జరిగేవి! కానీ ఇటీవలి కాలంలో పుంజుకుంటున్నాయి. నగదు రహిత లావాదేవీలను జనవరి నాటికి 20 శాతానికి తీసుకువచ్చే లక్ష్యంతో అధికారులు ప్రచార కార్యక్రమాలు కూడా చేపట్టారు. నగదు రహిత బదిలీలకై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపడుతున్నారు. వినియోగదారులు స్మార్ట్ ఫోన్లలో యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకుని, నగదు రహిత బదిలీలు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. ఆన్‌లైన్ విధానంలో నగదు రహితంగా ఎటిఎంలు, డెబిట్ కార్డుల వాడకంపై గ్రామీణ స్థాయిలో అవగాహన కార్యక్రమాలను సైతం నిర్వహి స్తున్నారు. దుకాణదారులకు స్వైపింగ్ యంత్రాలను పంపిణీ చేస్తున్నారు. ఈ యంత్రాల వినియోగానికి అవసరమైన లైసెన్స్‌లను పంచాయతీ కార్యదర్శులు జారీచేసేలా చర్యలు తీసుకున్నారు.